టాలీవుడ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. అప్పుడప్పుడు కొన్ని ఫ్లాప్‌లు పడినా.. ఆయన బ్యానర్ మీద వచ్చే చాలా మటుకు సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే అలాంటి దిల్ రాజును ఒక మూవీ కోలుకోలేని దెబ్బతీసిందట.
చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది వందల కొద్దీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా.. వాటిలో పది, పదిహేను మాత్రమే విజయాలు సాధిస్తున్నాయి. బ్లాక్ బస్టర్‌గా నిలిచే చిత్రాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీసే మూవీ ఇండస్ట్రీలో విజయాల కంటే పరాజయాల శాతమే ఎక్కువైనప్పటికీ కొందరు నిర్మాతలు ప్యాషన్‌తో చిత్రాలు తీస్తున్నారు. సినిమాల మీద ఉన్న ఇష్టం, ప్రేమతో నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు. ఏటేటా కొత్త ప్రొడ్యూసర్స్, నూతన నిర్మాణ సంస్థలు ఎన్ని వస్తున్నా అవేవీ పెద్దగా నిలదొక్కుకోవడం లేదు. ఒక్క ఫ్లాప్‌తో మూటాముళ్ల సర్దుకుంటున్నారు. హిట్లు, ఫ్లాపులు వచ్చినా తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉన్న కొందరు నిర్మాతలు మాత్రమే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అతికొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. అటు పంపిణీ రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తూనే.. ఇటు నిర్మాతగానూ సినిమాలు తీస్తున్నారాయన. దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక చిత్రం వస్తోందంటే ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియెన్స్ ఇలా అందరూ చూసే విధంగా ఆయన చిత్రాలను రూపొందిస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ తీస్తున్నప్పటికీ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తారు. అందుకే ఒకవేళ ఆయన బ్యానర్ చిత్రాలు ఫెయిలైనా తక్కువ నష్టాలతో బయట పడుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. హీరోల మార్కెట్, కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్ లెక్కలు చూసుకుని వెళ్లే దిల్ రాజుకు ఇన్నేళ్లలో మ్యాగ్జిమమ్ హిట్లే ఉన్నాయి. అలాంటి దిల్ రాజును ఒక సినిమా భారీగా దెబ్బతీసింది. అదే ‘శాకుంతలం’.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ను ఆయన కూతురు నీలిమ గుణ నిర్మించారు. ఈ మూవీని దిల్ రాజు సమర్పించారు, అలాగే పంపిణీ బాధ్యతలు కూడా తీసుకున్నారు. చిత్ర కథ నచ్చడంతో సినిమా నిర్మాణంలో ఆయన భాగస్వామిగా చేరారు. అయితే ‘శాకుంతలం’ దిల్ రాజును కోలుకోలేని దెబ్బతీసిందట. ‘బలగం’ గ్రాండ్ సక్సెస్, ‘దసరా’ డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారీగా లాభాలు ఆర్జించిన దిల్ రాజుకు ‘శాకుంతలం’ పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నా 25 ఏళ్ల కెరీర్లో ‘శాకుంతలం’ పెద్ద ఝలక్ ఇచ్చింది” అని దిల్ రాజు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.