తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ మద్యనే జబర్ధస్త్ వేణు కి దర్శకుడిగా మంచి ఛాన్స్ ఇచ్చి ‘బలగం’ లాంటి సూపర్ హిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ ఎవరూ అంటే వెంటనే దిల్ రాజు అని చెప్పేస్తారు. స్టార్ హీరోలే కాదు అప్ కమింగ్ హీరోలతో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు దిల్ రాజు. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎంతోమంది కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ మద్యనే జబర్ధస్త్ వేణు కి దర్శకుడిగా మంచి ఛాన్స్ ఇచ్చి ‘బలగం’ లాంటి సూపర్ హిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆఫర్లు ఇచ్చే దిల్ రాజు.. తనకు ఈ కొత్త ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.. కాకపోతే అవి ఇండస్ట్రీ పరంగా కావు.. పొలిటికల్ ఆఫర్లు. ఇటీవల దిల్ రాజు రాజకీయ ఎంట్రీపై రక రకాల వార్తలు వస్తున్నాయి.. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..
దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి.. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మొదటి చిత్రం నితిన్ హీరోగా నటించిన ‘దిల్’. ఈ మూవీ పేరుతో దిల్ రాజు గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. దిల్ రాజు సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలో ఉండే ప్రముఖులతో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలోనే దిల్ రాజు వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెగ వార్తలు వస్తున్నాయి. కాకపోతే దిల్ రాజు మాత్రం ఈ విషయం గురించి ఏనాడూ బయట పడలేదు.
ఇటీవల బలగం చిత్రంతో మంచి విజయం అందుకున్న దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ లో తన పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పొలిటికల్ ఎంట్రీ పై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ రాజకీయాల్లోకి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని నాకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి.. కానీ, నేను రాను.. ఎందుంటే ఇండస్ట్రీలో ఎవరైనా నన్ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నా.. అలాంటిది రాజకీయాల్లో వచ్చాక తట్టుకోగలనా..? ఎన్నో అడ్డంకులు ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వస్తానో రానో అనేది ఇప్పుడు అప్రస్తుతం’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. అంటే తనకు రాజకీయాలు వద్దు అని సున్నితంగా తిప్పి కొట్టాడా? తన పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. నటులు, దర్శక, నిర్మాతలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కొంతమంది సక్సెస్ అయితే.. కొంతమంది కనిపించకుండా పోయారు. ఇటీవల దిల్ రాజు సొంత వ్యయంతో నిర్మించిన ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల బలగం మూవీ ప్రమోషన్ సందర్భంగా ప్రత్యేక అతిధిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ దిల్ రాజు ను గొప్ప నిర్మాతగా మెచ్చుకుంటూ పార్టీ కూడా కోరుకుంటుందని అన్నారు. దీంతో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పెడుతూ.. నాకు రాజకీయాలు పడవు నిర్మొహమాటంగా చెప్పేశాడు.