ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు కాలం నడుస్తోంది. ఇండస్ట్రీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్స్ ను సైతం ఆగస్టు 1 నుంచి నిలిపివేశాయి. అయితే తాజాగా జరిగిన ఇద్దరి భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. ఇప్పుడు పరిశ్రమ అంతా వారిద్దరి గురించే మాట్లాడుకుంటోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లో కి వెళితే..
మొన్నటికి మొన్న సీనియర్ నటి జయసుధ.. మా అధ్యక్షుడు మంచు విష్ణు టార్గెట్ గా మా బిల్డింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో ఇంకొంత మంది ‘మా’ తీరుపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు సహా మరి కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు మంచు విష్ణుతో సమావేశమయ్యారు. ‘మా’ లోకి కొత్త సభ్యులను చేర్చడానికి ఈ సమావేశంలో కొంత చర్చ జరిగిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ బంద్ చేయడం నుంచి ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, షూటింగుల్లో వేస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవడం, పరభాషా నటీ నటుల మెంబర్ షిప్ ఫీజు తదితర అంశాలపై కీలక చర్చ జరిగిందని వినికిడి. కాస్ట్ కంట్రోల్ కోసం, రెమ్యూనరేషన్‌ల విషయంలో గిల్డ్ ప్రత్యేక కమిటీ వేసింది.
ఈ సమావేశానికి జీవితా రాజశేఖర్, రఘు బాబు, శివ బాలాజీ తదితరులు హాజరయ్యారు. గిల్డ్ నుంచి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, దామోదర్ ప్రసాద్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, భోగవల్లి బాపినీడు, ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్, ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ నుంచి వివేక్ కూచిభొట్ల తదితరులు హాజరయ్యారు. మరి దిల్ రాజు-విష్ణు భేటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J
— Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022
ఇదీ చదవండి: Prabhas: సీతా రామం ఈవెంట్ కి క్యాప్ తో ప్రభాస్! కారణం ఏమిటంటే?
ఇదీ చదవండి: పాన్ ఇండియా సినిమాలపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్!