టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యక్తిగతం తెరిచిన పుస్తకమే చెప్పవచ్చు. దిల్ రాజుకి చిన్న వయసులో వివాహం జరిగింది. ఆమె మొదటి భార్య అనిత 2017లో మరణించారు. వీరికి ఓ కుమార్తె హన్షితా రెడ్డి. దిల్ రాజుకు కుమార్తె అంటే ఎనలేని ప్రాణం.మొదటి భార్య మరణంతో ఒంటరిగా ఉన్న దిల్ రాజుకు కుమార్తె హన్షితా రెడ్డి, ఆమె భర్త అర్చిత్ రెడ్డి కలిసి రెండవ వివాహం చేశారు. అయితే తల్లి మరణం వరకు హన్షితా గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు.
హన్షితా రెడ్డి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1991లో హన్షితా జన్మించారు. తల్లి మరణానికి ముందే 2014లోనే హన్షితా రెడ్డికి అర్ఛిత్ రెడ్డితో వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరికి సంబంధించిన ఫోటోలను హన్షితా ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూనే ఉంటుంది. కాగా, తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సైతం హన్షితా షేర్ చేసుకున్నారు. అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమెకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేసేజ్ లు పెడుతున్నారు.
హన్షితా ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందించే సినిమాల పట్ల కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త అర్చిత్ రెడ్డి కూడా పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఆహా కోసం కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు మేనేజింగ్, డైరెక్టర్ గా కూడా హన్షితా వ్యవహరిస్తున్నారు. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో తెరకెక్కిన శాకుంతలం వచ్చే నెలలో విడుదల అవుతుండగా, రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది.