సినీ హీరోలపై ప్రజలకు ఉండే అభిమానం ఎంతో గొప్పది.. దాన్ని ఎవరూ వెలకట్టలేరు. వెండితెరపై తమ అభిమాన హీరో కనిపించగానే కాగితాలు, పూలు చల్లుతుంటారు. థియేటర్ల బయట ఆ చిత్రం ‘తొలి షో’కు ముందుగానే భారీ కటౌట్లు పెడుతుంటారు. వాటికి పూలదండలు వేసి, పాలాభిషేకం కూడా చేసేస్తుంటారు. మరి కొందరు అభిమానులైతే ఏకంగా గుడి కట్టించి పూజిస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తమ హీరోలకు మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొన్ని సందర్భంగా వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తమ అభిమాన నటీనటులను కలిసేందుకు వస్తుంటారు. ఓ అభిమాని రామ్ చరణ్ కోసం గొప్ప సాహసం చేశాడు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్ అంటే బళ్లారికి చెందిన చంద్రశేఖర్ కి పంచ ప్రాణాలు. ఇప్పటి వరకు రామ్ చరణ్ పేరుపై ఎన్నో సేవాకార్యక్రమాలు చేశాడు. చరణ్ పుట్టిన రోజు వస్తే ఫ్యాన్స్ తో తెగ సందడి చేస్తాడు చంద్రశేఖర్. తన అభిమాన హీరోని ఎలాగైనా కలవాలని నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఆయన్ని కలవాలని చూసినా పలు ఇబ్బందుల కారణంగా చరణ్ కి కలిసే ప్రయత్నం విరమించుకున్నాడు చంద్రశేఖర్. అయితే ఈసారి చరణ్ ని కలిసేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు. బళ్లారి నుంచి బయలుదేరి ఎనిమిది రోజుల పాటు కాలి నడకన పయనించి హైదరాబాద్ కి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా బల్లారి నుంచి హైదరాబాద్ కి వచ్చిన చంద్రశేఖర్ కి ఆలిండియా చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఘన స్వాగతం పలికాడు. ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. చంద్రశేఖర్ కి శాలువా కప్పి సన్మానించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేధికగా పంచుకున్నాడు.. అలాగే త్వరలో రామ్ చరణ్ ని కూడా కలవబోతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
*మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి మెగా అభిమాని**బళ్ళారి వాస్తవ్యులు శ్రీ B. చంద్ర శేఖర్ బళ్ళారి నుండి హైదరాబాద్ కి 8 రోజులు నడుచుకుంటూ *శ్రీ రామ్ చరణ్ గారిని కలవాలని ప్రయత్నం చేసారు* .
శ్రీ రామ్ చరణ్ గారు త్వరలో కలవనున్నారు. pic.twitter.com/4Zd8uN2FJh
— Ravanam Swami naidu (@swaminaidu_r) June 30, 2022