అభిమానం ఆకాశాన్ని దాటడమంటే బహుశా ఇదేనేమో! అయితే ఒక అభిమాని ఇష్టంతో ఆమెకు తన ఇంటిలోనే గుడిని నిర్మించి ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నాడు. ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే ?
అభిమానం ఆకాశాన్ని దాటడమంటే బహుశా ఇదేనేమో! సాధారణంగా స్టార్ హీరోలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడం అనేది మనకి తెలిసిన విషయమే. కానీ ఒక స్టార్ హీరోయిన్ మీద కూడా ఇంతలా అభిమానం చూపించేవారున్నారా ?అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇతడి అభిమానం ఎంతలా దాటిపోయిందంటే ఏకంగా ఆ హీరోయిన్ కోసం గుడినే కట్టేస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగులో హీరోయిన్ కోసం ఇలా గుడి కట్టడం ఇదే మొదటి సారి. అలాంటి అరుదైన లిస్టులో చేరిపోయింది స్టార్ హీరోయిన్ సమంత. మరి సమంతకు గుడి కడుతున్నది ఎవరు ?ఎక్కడ దీనిని నిర్మిస్తున్నారు?
సాధారణంగా హీరోయిన్లకు గుడి కట్టడమనేది ఇదే తొలిసారి కాదు. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకే ఇలా గుడిని నిర్మించి అభిమానులు వారి ప్రేమను చాటుకుంటారు. ఇప్పటివరకు ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి వారికి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే వేలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పేరు మీద అభిమానులు గుడిని ప్రారంభించి సర్ప్రైజ్ చేశారు. అయితే ఇదంతా తమిళ్ ప్రజలకే సాధ్యమైంది. తెలుగులో ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ హీరోయిన్ కి మన తెలుగు ప్రజలు గుడి కట్టిన సందర్భాలు లేవు. హీరోయిన్ సమంతకు ఆ అవకాశం దక్కింది.
బాపట్ల జిల్లా ఆలపాడు జిల్లాకి చెందిన ఆ వీరాభిమాని పేరు సందీప్. ఇతను సమంతకు డై హార్డ్ ఫ్యాన్. సమంత మీద ఇష్టంతో ఆమెకు తన ఇంటిలోనే గుడిని నిర్మించి ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నాడు. ఇలా ఇంటిలో గుడి కట్టడం అనేది ఇప్పటివరకు మనం చూడలేదు. సమంత పుట్టిన రోజు(ఏప్రిల్ 28) న ఈ గుడిని ప్రారంభించనున్నారు. సమంత మయోసైటీస్ వ్యాధినుంచి కోలుకున్న సందర్భంగా ఈ డై హార్డ్ ఫ్యాన్ ఇటీవలే తిరుపతి, చెన్నై నాగపట్నం,కడప దర్గా దైవ క్షేత్రాల్లో సర్వమత మొక్కుబడుల యాత్ర నిర్వహించాడు. ఇక సమంత ఇటీవలే శాకుంతలం సినిమాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి బాపట్లకు చెందిన సందీప్ అభిమానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.