పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోయినా.. ప్రతి సినిమాని ఫ్యాన్స్ అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటూనే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు పవన్. ఈ ఏడాది భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఇప్పుడు హరి హర వీరమల్లు, వినోదయ సితం రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు తాజాగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేసి కిక్కిచ్చాడు.
ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య డీవీవీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘ఓజి’ అని టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే.. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి క్యాపబిలిటీ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు. పైగా సాహో సినిమా వచ్చి కూడా 3 ఏళ్ళు దాటింది. దీంతో ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడా? అని వెయిట్ చేస్తున్న తరుణంలో.. ఏకంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేశాడు సుజిత్. అయితే.. రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగనుందని అంచనా వేస్తున్నారు. కాగా.. తాజాగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో భారీ చర్చలు జరుగుతున్నాయి.
సుజిత్ చేసిన రెండు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా జిబ్రాన్ వర్క్ చేశాడు. అలాగే ఈ సినిమాకి కూడా అతని పేరే వినిపించింది. కానీ.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ ని తీసుకోవాలని మేకర్స్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పైగా ‘వి వాంట్ అనిరుద్ ఫర్ ఓజి’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ కూడా అనిరుధ్ ని సంప్రదించడం జరిగిందట. అయితే.. చేతినిండా తమిళ స్టార్ హీరోలందరి సినిమాలతో బిజీగా ఉండటం వలన తాను పవన్ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. గతంలో అజ్ఞాతవాసి సినిమాకి అనిరుధ్ మంచి మ్యూజిక్ అందించాడు.
అదీగాక ఇప్పుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలన్నీ మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. మాస్టర్, ఇండియన్ 2, జైలర్, ఎన్టీఆర్30, దళపతి 67 ఇలా వరుసగా పెద్ద సినిమాలు చేతిలో ఉండేసరికి కొత్త సినిమాలు అంగీకరించడం లేదని చెప్పేశాడట అనిరుధ్. దీంతో పవన్ సినిమా కోసం మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుకుతున్నారట సుజిత్, దానయ్య. మరి పవన్ ఫ్యాన్స్ అనిరుద్ కావాలని రిక్వెస్ట్ అయితే చేశారు.. కానీ.. అనిరుధ్ కి ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాకి తాను వర్క్ చేయలేకపోతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి నెక్స్ట్ ఎవరిని ఓజికి మ్యూజిక్ డైరెక్టర్ గా రానున్నారో!
1. #OG Original Gangster
2. Gun as Shadow to PK
3. Japanese Letters
4. Blood red colour,Walking into Orange Sunset (firestorm is coming)
5.Landmarks Line (left-Statue of Liberty)#PSPK29 #Pawankalyan @sujeethsign @PK_Addicts @PSPK_FC @PawanismNetwork @PawanKalyanFan pic.twitter.com/9pH1jBqbzm— Zee Telugu News (@ZeeTeluguLive) December 5, 2022
Set cheyandra combo @PawanKalyan and @anirudhofficial ❤️😎#WeWantAnirudhForOG pic.twitter.com/cPmhPMOXGD
— powerking 🔥 (@attitudeboy183) December 7, 2022
Beats 🥁🥵@anirudhofficial music ❤️#WeWantAnirudhForOG pic.twitter.com/NXOvotpPQI
— powerking 🔥 (@attitudeboy183) December 7, 2022