బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తన ఒంటరి జీవితానికి ముగింపు పలికి సంసార జీవితంలోకి అడుపెట్టనుంది. గత కొంతకాలంగా హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్న కత్రిన… అతనితో కలిసి వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. జైపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లికి ఆహ్వానించాల్సిన అతిథుల లిస్టు తయారు చేసి వారికి పంపినట్లు సమాచారం. ఆ కోవాలోనే సల్మాన్ ఖాన్ కు అతని సోదరికి ఇన్విటేషన్ పంపినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ స్పందించారు.
గతంలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గుస్సగుస్సలు వినిపించాయి. ఆ మాటలు నిజమే అన్నట్లు వారిద్దరు అప్పట్లో ఎక్కడ చూసిన చెట్టపట్టాలేసుకుని తిరిగేవారు. సల్మాన్ ఖాన్ నటించే సినిమాల్లో కత్రినాకు ప్రాధాన్యత ఇచ్చే వారు. సల్మాన్ ఖాన్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పి కత్రినాతో ఒక్కటైతాడని అన్నుకున్నారు అందరు. కానీ వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు విడిపోయారు. అనంతరం సల్మాన్ ఖాన్ మరేవరితో ఇప్పటి వరకు రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం లేదు. అయితే సల్మాన్ ఖాన్ స్నేహితురాలిగా పేరు పొందిన కత్రిన.. అనంతరం రణ్బీర్ కపూర్తో ప్రేమాయణం సాగించినట్లు సమాచారం. రణ్బీర్ ఫ్యామిలీతో మనస్పర్థల కారణంగా అతనితో బ్రేకప్ అయ్యింది కొందరి అభిప్రాయం. ఇప్పుడువిక్కీ కౌశల్ తో స్నేహం ఏర్పడి, అది కాస్తా ప్రేమకు దారి తీసింది.చివరికి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు..
సల్మాన్ ఖాన్, అతడి సోదరీమణులకూ వివాహ ఆహ్వానం పంపినట్లు వస్తున్న వార్తలపై సల్మాన్ గారాల చెల్లెలు అర్పితా ఖాన్, ఫ్యామిలీ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అర్పితా ఖాన్ స్పష్టం చేసింది. సల్మాన్ ఫ్యామిలీకి కత్రినా నుంచి ఎలాంటి ఆహ్వానాలూ రాలేదని కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. కత్రిన అంటే సల్మాన్ ఖాన్ కు అభిమానమని, ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడని తెలిపారు. కత్రినా కైఫ్ వివాహానంతరం టైగర్-3 చిత్ర షూటింగ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఆహ్వాన దుమారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.