Dia Mirza: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు, హీరోయిన్లు పెళ్లిళ్ల విషయంలో అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. పెళ్లి వార్తలంటే ఓకే గానీ.. హీరోయిన్ల ప్రెగ్నన్సీ వార్తలు వచ్చేసరికి ఫ్యాన్స్ కంఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే.. కొందరు హీరోయిన్లు పెళ్ళయ్యాక కొంత సమయం తీసుకొని ప్రెగ్నన్సీ కబురు బయట పెడతారు. కానీ.. మరికొందరు పెళ్లికి ముందే ప్రెగ్నన్సీ అని.. లేదా పెళ్ళైన మూడు నెలల్లోపే గర్భం దాల్చినట్లు ప్రకటించేసరికి షాక్ అవుతుంటారు.
బాలీవుడ్ నటి దియా మిర్జా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు హిట్ సినిమాలు చేసిన దియా.. బిజినెస్ మ్యాన్ వైభవ్ రాఖీని పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ చేసింది. అయితే.. పెళ్ళైన నెలన్నరకే ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పి అందరికి షాకిచ్చింది. ఈ విషయం తెలిసేసరికి అందరూ కూడా గర్భం దాల్చాకే పెళ్లి చేసుకుందని అభిప్రాయపడ్డారు.
తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ సైతం పెళ్లయిన రెండున్నర నెలలకే తన ప్రేగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టడంతో.. అలియా కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో దియా మిర్జా స్పందిస్తూ.. పెళ్లికి ముందు ఒక అమ్మాయి తల్లి కాకూడదని నియమాలు ఏమీ లేవు. పెళ్లికి ముందే సంభోగంలో పాల్గొనాలా లేదా? పెళ్లికి ముందే గర్భం దాల్చాలా లేదా? అనే విషయాలు పూర్తిగా అమ్మాయి వ్యక్తిగత విషయాలని చెప్పుకొచ్చింది.
ఇలాంటి పనులు మన సాంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకమమే. కానీ.. ఒక అమ్మాయి వ్యక్తిగత విషయాలను కూడా మనం గౌరవించాలి. ఒకమ్మాయి పెళ్లికి ముందే తన జీవితం ఎలా ఉండాలి అని నిర్ణయించుకొనే అధికారం తనకు ఉంటుంది. కాబట్టి.. మనం వారి అభిప్రాయాలను గౌరవించాలి అంటోంది. అదీగాక.. గతంలో దియా కూడా తన ప్రెగ్నన్సీ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఇలా ఘాటుగా స్పందించి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక దియా మీర్జా తెలుగులో నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ మూవీలో నటించింది. మరి దియా మీర్జా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.