ధ్రువ సార్జా తాజా చిత్రం మార్టిన్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారనున్నారు. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో ప్యాన్ ఇండియా సినిమా కేడీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రముఖ హీరో అర్జున్ సార్జా నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ధ్రువ సార్జా. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలమే అయినా.. పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. కేవలం ఆరు సినిమాలతోనే కన్నడ నాట స్టార్ హీరోగా మారిపోయారు. 2021లో వచ్చిన పొగరు సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యారు. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికి అతడికి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం అతడు ‘మార్టిన్’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక, అసలు విషయానికి వస్తే.. అర్జున్ సార్జా స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. వారి అవసరాలను తెలుసుకుని మరీ సహాయం చేస్తుంటారు. తాజాగా ఆయన తన మిత్రుడి పుట్టిన రోజు నాడు అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. అత్యంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. దాదాపు 52 లక్షల రూపాయలు విలువ చేసే కారును తన ప్రాణ స్నేహితుడు అశ్విన్‌కు కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు ధ్రువ సార్జాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ధ్రువ సార్జా, అశ్విన్‌ల స్నేహం గురించి కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తానికి తెలుసు. ధ్రువ సార్జా ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఏ షూటింగ్‌కు వెళ్లినా అశ్విన్ ఆయన వెంటే ఉంటారు. ఇక, ఫ్యాన్స్ విషయంలోనూ ధ్రువ చాలా ఉదారంగా ఉంటారు. ఫ్యాన్స్‌తో మీటింగ్‌లు ఏర్పాటు చేసి వారిని కలవటమే కాకుండా.. వారికి అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. మరి, ధ్రువ సార్జా తన మిత్రుడికి ఇచ్చిన కాస్ట్‌లీ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.