జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హైపర్ ఆది. దాని ద్వారా అతడికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బుల్లితెర మీద రైటర్, ఆర్టిస్ట్, డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. ఇవే కాక.. సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇక హైపర్ ఆది పంచులకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో హైపర్ ఆది పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం యాంకర్ వర్షిణితో లవ్‌లో ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకసార్లు హైపర్ ఆది లవ్, మ్యారేజ్ గురించి బోలేడు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా హైపర్ ఆదికి నిశ్చితార్థం అయ్యిందని.. అది కూడా ఓ స్టార్ హీరోయిన్‌తో అనే వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ మధ్య కాలంలో బుల్లితెర మీద వచ్చే పలు షోల రేటింగ్‌ల కోసం.. కొందరు నటుల మధ్య లవ్ ట్రాక్‌లు నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన వారిలో రష్మి-సుధీర్ జోడి ముందు వరుసలో ఉంటుంది. స్క్రీన్ మీద వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే.. నిజంగా లవర్స్ అనే అనిపిస్తారు. చాలా మంది వీరిద్దరూ వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే తమ మధ్య ఏం లేదని.. షో కోసం అలా చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో హైపర్ ఆదికి, ఓ హీరోయిన్‌తో నిశ్చితార్థం జరిగినట్లు చూపించారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈటీవీలో ప్రతి బుధవారం డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 14 నడుస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం టీమ్ లీడర్లు, జడ్జీల మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు చూపించడం కామన్‌గా జరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే బుధవారం అనగా అక్టోబర్ 19న ప్రసారం కాబోయే.. ఎపిసోడ్‌లో టీమ్ లీడర్ హైపర్ ఆదికి, హీరోయిన్ శ్రద్ధా దాస్‌కి ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రోమో కట్ చేసి వదిలారు షో నిర్వాహకులు. ‘హైపర్’ ఆది, శ్రద్ధా దాస్ మధ్య ప్రేమ ఉన్నట్లు ఒక సాంగ్‌కి డ్యాన్స్ చేశారు కంటెస్టెంట్లు. అది పూర్తయిన తర్వాత శ్రద్ధా దాస్.. ‘ఆదితో నా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది’ అంటూ సరదాగా కామెంట్ చేసింది.
ఇక సాంగ్ కంప్లీట్ అయ్యాక… డ్యాన్సర్లు అందరూ కలిసి ‘హైపర్’ ఆదిని శ్రద్దా దాస్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆది వేలికి ఉంగరం తొడిగినట్లు ఆమె ఏదో చేశారు. ఆ సమయంలో మిగతా వాళ్లంతా వారిద్దరిపై పువ్వులను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.