సినిమా ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలోని వాళ్లను జనం తమ సొంత ఆస్తిలా భావిస్తుంటారు. ప్రతీ చిన్న విషయానికి వారిపై విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ట్రోలింగ్స్ అన్న పేరుతో వికృత చేష్టలు మొదలయ్యాయి. హీరో, హీరోయిన్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయటం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ చిన్న విషయాన్ని దారుణంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా, తమిళ హీరోయిన్ దర్శ గుప్తను ట్రోలర్స్ టార్గెట్ చేశారు. దర్శకు యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉందంటూ విమర్శించటం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. మీడియా ముందే బోరున విలపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. దర్శ గుప్త తాజా చిత్రం ‘‘ఓ మై గోస్ట్’’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న దర్శ మీడియా ముందుకు వచ్చారు. వచ్చి రాగానే ఏడ్వటం మొదలుపెట్టారు. ‘‘ నేను వారికి ఏం చేశాను?.. ఎందుకు నన్ను అలా ప్రొజెక్టు చేస్తున్నారు. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు’’ అంటూ ఏడ్వటం మొదలుపెట్టారు. మీడియా ప్రతినిధులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. ‘‘ నిన్న నేను నడుస్తూ ఉండగా ఎవరో నా డ్రెస్ పట్టుకుని ఆపినట్లుగా అనిపించింది. నేను వెనక్కు తిరిగి చూస్తే నా డ్రెస్‌పై ఓ వ్యక్తి కాలు వేసి ఉన్నాడు. అతడు నా అసిస్టెంట్..
నా తమ్ముడిలాంటి వాడు. నేను అతడ్ని ఎలా చూస్తానో అతడికి తెలుసు. కానీ, నాకు యాటియ్యూడ్ ప్రాబ్లమ్ అంటూ ఓ కామెంట్ వచ్చింది. దాని వల్ల నేను మానసికంగా దెబ్బతిన్నాను. నాతో క్లోజ్‌గా ఉన్న వారికి నాది చిన్న పిల్లల మనస్తత్వం అని తెలుసు. నేను ప్రతిఒక్కరిని నా కుటుంబంలా చూస్తాను. అతడు నా యాటియ్యూడ్ గురించి అడిగిన ప్రశ్న నన్ను బాగా బాధించింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ఆమెను ఓదార్చటంతో మామూలు మనిషి అయ్యారు. మరి, తప్పుడు వార్త కారణంగా మనసు నొచ్చుకున్న హీరోయిన్ దర్శ గుప్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.