చిత్రపరిశ్రమలో నటీనటులు కొన్నిసార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు.. ఇంకొంతమంది చెప్పుకోరు. అది వాళ్ళ పర్సనల్ ఛాయస్. కానీ, ఏదొక సందర్భంలో వారి సీక్రెట్ పెళ్లి గురించి వార్తలు బయటకి వచ్చేస్తాయి. తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించి సీక్రెట్ మ్యారేజ్ విషయాన్నీ రివీల్ చేసింది టాలీవుడ్ నటి కల్పిక గణేష్. రీసెంట్ గా ఫ్యాన్స్ తో లైవ్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది కల్పిక. అయితే.. అసలు విషయం ఏంటంటే.. సీక్రెట్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ కూడా ఇంతవరకు తన పెళ్లి విషయాన్ని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ధన్య బాలకృష్ణ. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సెవెన్త్ సెన్స్, నేను శైలజ, జయజానకి నాయక లాంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ పోషించి.. హల్చల్, సాఫ్టువేర్ సుధీర్, అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటి అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాలే కాకుండా తెలుగులో అల్లుడు గారు, లూజర్, రెక్కీ లాంటి వెబ్ సిరీస్ లలో కూడా మెరిసింది. కర్ణాటకలో పుట్టిపెరిగిన ధన్య.. మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. అలా మొదట తమిళంలో కెరీర్ స్టార్ట్ చేసి.. తర్వాత తెలుగులో పరిచయమైంది.
ఈ క్రమంలో నటిగా ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ సాగిస్తున్న ధన్య బాలకృష్ణ.. ఆల్రెడీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అదికూడా ధన్య పెళ్లి జరిగి కూడా ఏడాది కావస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని తెలుగు బ్యూటీ కల్పిక గణేష్ ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. ధన్య బాలకృష్ణ ఈ ఏడాది జనవరిలో మారి, మారి 2 సినిమాల దర్శకుడు బాలాజీ మోహన్ ని రెండో పెళ్లి చేసుకుందని, ఆమె చెన్నై వెళ్ళినప్పుడల్లా బాలాజీతోనే ఉండేదని తెలిపింది. ఇక పెళ్లి చేసుకున్నప్పటకీ, ఇప్పటివరకు బయట ప్రపంచానికి ఇద్దరూ చెప్పలేదని.. పెళ్లి తర్వాత ఆమెను డైరెక్టర్ టార్చర్ పెడతాడని అనుకున్నా.. కానీ ప్రెజెంట్ ఇద్దరూ బాగానే ఉన్నారని చెప్పింది కల్పిక. ప్రస్తుతం ధన్య గురించి కల్పిక మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.