స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సార్'. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమా హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా సార్(తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది.
తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్’. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సోషల్ మెసేజ్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కాగా.. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ.. మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సార్ మూవీ.. తెలుగుతో తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న సార్ మూవీ రిలీజ్ కాగా.. ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమా హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక కలెక్షన్స్ పరంగా కూడా సార్(తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రొఫెసర్ బాల గంగాధర్ తిలక్ అలియాస్ బాలు పాత్రలో ధనుష్ నటించాడు. కాగా.. ఈ సినిమాలో ధనుష్ నటనకు గాను ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. మరోవైపు హీరోయిన్ సంయుక్త.. లెక్చరర్ మీనాక్షి పాత్రలో నటించింది. అయితే.. ఇప్పుడీ సార్ సినిమాలో కంటెంట్ తో పాటు నటీనటుల పెర్ఫార్మన్స్ కి ఫిదా అవుతున్న ఆడియెన్స్.. థియేటర్స్ లో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కాగా.. తెలుగు వరకు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన సార్.. తమిళంలో వాతిగా బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతుంది.
ఇదిలా ఉండగా.. సార్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రూ. 6 కోట్లు.. తమిళనాడులో రూ. 19 కోట్లు.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 4.5 కోట్లు.. ఓవర్సీస్ రూ. 6 కోట్లు.. బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా సెట్ అయ్యింది. కాగా.. గత 4 రోజులలో సార్/వాతి మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 56 కోట్లు గ్రాస్.. రూ. 29 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 7 కోట్లు షేర్ రాబడితే.. వరల్డ్ వైడ్ మూవీ క్లీన్ హిట్స్ లో చేరిపోతుంది. సో.. తెలుగు వరకే చూసుకుంటే సార్.. 6 కోట్లకు రూ. 10 కోట్లు రాబట్టింది. అంటే.. ఆల్రెడీ తెలుగులో 4 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మేజర్ ప్లస్ అయ్యింది. మొత్తానికి మరో రెండు రోజుల్లో సార్ మూవీ క్లీన్ హిట్ కానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. సార్ మూవీపై మీ అంచనాలను, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Vaathi / #Sir
4 days ww collection
TN – 19.5cr
AP TG – 18.5cr
KA – 4.5cr
ROI – 1cr
Total India Gross – 43.5cr
Overseas – 13crTotal Gross – 56.5cr
— TFI_Movies (@TFI_Movies) February 21, 2023