తమిళ స్టార్ హీరో ధనుష్.. ఇటీవలే విడాకుల వార్త చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే.. విడాకులు ప్రకటించినప్పటి నుండి ధనుష్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత ధనుష్ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.
కొన్నేళ్లుగా విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు ధనుష్. మంచి నటుడిగానే కాకుండా మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా పేరు తెచుకున్నాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా భార్యకు విడాకులు ప్రకటించడం అనేది అటు ఫ్యాన్స్ ని, ఇటు ఇండస్ట్రీని ఆశ్చర్యపడేలా చేసింది. కొద్దికాలంగా ధనుష్, ఐశ్వర్యల మధ్య విభేదాలు రావడంతో విడాకులకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.ఇక ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడాకులు తీసుకున్నారు? అనే ప్రశ్నపై వారు ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. వీరికి ఇద్దరు కొడుకులు యాత్ర(16), లింగా(12). భర్తగా ఐశ్వర్యకు దూరం అయినప్పటికీ ధనుష్ ఓ తండ్రిగా ఇంకా బాధ్యతను మర్చిపోలేదని లేటెస్ట్ ఫోటో చూస్తే అర్దమవుతుంది. ప్రస్తుతం ధనుష్ తన పెద్ద కొడుకు యాత్రతో కలిసి ఉన్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇకపై ధనుష్ వీలైనంత ఎక్కువ సమయాన్ని తన పిల్లలకు కేటాయించేందుకు ఇష్టపడుతున్నాడట. ఇక సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ ప్రస్తుతం సెల్వా రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాలు వెంకీ అట్లూరితో సార్, శేఖర్ కమ్ములతో ఒక సినిమా లైనప్ చేశాడు. మరి ధనుష్ లేటెస్ట్ ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.