సెలబ్రిటీల ఇళ్లు అంటే మాములుగా ఉండవు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. అన్ని హంగులతో ఖరీదైన భవనాలు నిర్మించుకుంటారు. ఇక తాజాగా హీరో ధనుష్ కూడా కొత్త ఇంట్లో ప్రవేశించాడు. కోట్ల రూపాయల విలువైన ఈ ఇంటిని తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఇల్లు ఖరీదు ఎంతంటే..
తల్లిదండ్రులు మనకు జన్మనివ్వడమే కాక.. మనం జీవితంలో స్థిరపడేవరకు.. చేయూతనందిస్తారు. ప్రతి కష్టంలో తోడుగా ఉంటారు. పిల్లల ఆశలు తీర్చడమే వారి విధి అన్నట్లుగా బతుకుతారు. పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఆస్తులు, అంతస్తులు కోరుకోరు. మలి దశలో తమ మీద కాస్త ప్రేమ, ఆదరణ, అభిమానం చూపితే చాలనుకుంటారు. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే.. ఎంతో సంబరపడతారు. అయితే నేటి కాలంలో కొందరు పిల్లలు.. తమ కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులకు వారు ఊహించని గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆనందం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా హీరో ధనుష్ కూడా కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ వివరాలు..
తాజాగా ధనుష్ సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. భారీ సక్సెస్ అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు సాధించింది. సార్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ధనుష్. ఈ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తూ.. కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు ధనుష్. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ధనుష్ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లు గత ఏడాదే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇంటి నిర్మాణం పూర్తయ్యింది.
చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించాడు ధనుష్. ఇక ఈ ఇంటి విలువ 150 కోట్ల రూపాయలు అన్నట్లు తెలుస్తోంది. ఇంత ఖరీదైన ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఇచ్చాడట ధనుష్. ఇక కొన్ని రోజుల క్రితమే తల్లిదండ్రులతో కలిసి నూతన ఇంట్లోకి ప్రవేశించాడు ధనుష్. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది ధనుష్ డ్రీమ్ హౌస్ అంటున్నారు అతడి సన్నిహితులు. అన్ని వసతులతో.. ఎంతో లగ్జరీగా ఈ ఇంటిని నిర్మించుకున్నాడు ధనుష్.
ధనుష్-ఐశ్యర్య విడిపోక ముందు ఈ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అప్పుడు వారే ఇక్కడే ఉండాలని అనుకున్నారట. కానీ విడాకులు తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దాంతో ప్రస్తుతం ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఇచ్చాడట ధనుష్. ఇక గృహ ప్రవేశం సందర్భంగా హోమం కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ధనుష్-ఐశ్వర్యలను కలిపేందుకు రజనీకాంత్, ధనుష్ తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక వీరిద్దరూ కలవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
సార్ సినిమా తెలుగులో ధనుష్ డెబ్యూ ఫిల్మ్. ఇప్పటికే ధనుష్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉండగా.. ఈ చిత్రం ద్వారా తెలుగులో తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నాడు. సార్ చిత్రం తెలుగులో కూడా మంచి వసుళ్లూ సాధిస్తోంది. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు. మరి ధనుష్ తల్లిదండ్రులకు ఇచ్చిన గిఫ్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
மனிதன் என்பவன்
தெய்வம் ஆகலாம்..நன்றி சார்..😊🙏🏻
2023’s Best Moment ❤️ Thank you @dhanushkraja #SIR !! #Mahashivratri special time with #Dhanush sir❤️💙 🙏 #vaathi pic.twitter.com/Um51eFa3iw
— B.RAJA (@B_RajaAIDFC) February 20, 2023