విశ్వక్ సేన్ 'ధమ్కీ' రిలీజైపోయింది. అందరిలానే తొలిరోజు ఈ సినిమా చూద్దామని ఆ థియేటర్ కు వెళ్లిన ఆడియెన్స్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఈ మూవీకి బదులు మరో దాన్ని ప్లే చేశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
తెలుగులో సినిమా ప్రేమికులు చాలా ఎక్కువ. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమాను ఆదరిస్తూ ఉంటారు. చాలావరకు రిలీజ్ రోజే థియేటర్ కి వెళ్లి మరీ మూవీ చూస్తుంటారు. ఆ రోజు ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. అరిచి గోల చేస్తారు. పేపర్లు ఎగరేస్తారు. మాస్ సినిమా అయితే రచ్చ రచ్చ చేస్తారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. చాలామంది సినిమాకు వెళ్లారు. కానీ ఓ థియేటర్ లో మాత్రం ఈ చిత్రానికి బదులు మరొకటి ప్లే చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా సరే దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వీడియోలు వైరల్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్ రావడంతో అంచనాలు కాస్త పెరిగాయి. విశ్వక్ సేన్ ఎనర్జీకి తగ్గట్లు ట్రైలర్స్ కూడా ఉండేసరికి ఈ సినిమాకు వెళ్లాలని చాలామంది అనుకున్నారు. కానీ వైజాగ్ లోని సుకన్య థియేటర్ కి వెళ్లిన వాళ్లకు మాత్రం విచిత్రమైన అనుభవం ఎదురైంది. టైటిల్ విషయంలో పొరబడ్డారో, ఫైల్ ని ప్లే చేయడంలో పొరబడ్డారో తెలియదు గానీ ‘ధమ్కీ’ బదులు రవితేజ ‘ధమాకా’ సినిమా వేశారు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓరి బాబోయ్ సినిమా మారిపోయిందారా అని అరిచి గోల చేశారు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అయిపోయింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ధమ్కీ, ధమాకా రెండు సినిమాల్లోనూ హీరో డబుల్ రోల్ చేస్తాడు. అందులో ఒకరేమో పేదవాడు కాగా మరొకరు ధనవంతుడు. అలానే రెండు మూవీస్ రైటర్ కూడా ప్రసన్నకుమార్ బెజవాడ కావడం విశేషం. రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూల్లోనూ విశ్వక్ సేన్.. ‘ధమాకా’ సినిమా గురించి ప్రస్తావించాడు. ట్రైలర్ చూసి చాలామంది ఆ సినిమాలా ఉందని పొరబడుతున్నారు. కానీ రెండు వేర్వేరు అని చెప్పుకొచ్చాడు. తాజాగా థియేటర్ లో ఈ సినిమా బదులు ఆ సినిమా వేసేసరికి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వస్తున్నాయి. చూసినవాళ్లందరూ తెగ నవ్వుకుంటున్నారు. మరి ‘ధమ్కీ’ బదులు ‘ధమాకా’ని థియేటర్ లో ప్లే చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
ధమ్కీ ధమాఖా దబిడి దిబిడి😂#Dhamaka is Played instead of #Dhamki in Vizag sukanya theatre this morning
Theatre Management Got Confused with the names itseems#DasKaDhamki@VishwakSenActor @RaviTeja_offl pic.twitter.com/IOU5CR3vcX
— Mr.RK (@RavikumarJSP) March 22, 2023