లక్ అంటే నిజంగా హీరో రవితేజదే! ఎందుకంటే గతేడాది చేసిన మూడు సినిమాల్లో రెండు, బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలయ్యాయి. ఇక 2022 చివర్లో రిలీజైన ‘ధమాకా’కు అయితే రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. హిట్ కావడం కష్టమేనని అన్నారు. కానీ అందరికీ షాకిచ్చేలా ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా మూడంకెల మార్క్ క్రాస్ మరీ.. విమర్శకుల నోళ్లు మూయిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఎలాంటి ప్రేక్షకుడికైనా సరే నచ్చేస్తుంది. ఎప్పుడో రిలీజైన వెంకీ, దుబాయి శ్రీను మూవీస్ ని ఇప్పటికీ చూస్తున్నారంటే దానిక వన్ అండ్ ఓన్లీ కారణం రవితేజ. అయితే మాస్ మహారాజా నుంచి సరైన ఎంటర్ టైనర్ వచ్చి చాలా రోజులైపోయింది. ఈ క్రమంలోనే గతేడాది చేసిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. ప్రేక్షకుల్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఇక రవితేజ ‘ధమాకా’ మూవీతో డిసెంబరు 23న థియేటర్లలోకి వచ్చాడు.
ఈ సినిమాలో డబుల్ యాక్షన్ తో అదరగొట్టిన రవితేజ.. ఫుల్ ఆన్ ఎనర్జీతో ప్రేక్షకులకు మస్త్ కిక్ ఇచ్చాడు. అలానే హీరోయిన్ శ్రీలీల కూడా డ్యాన్స్ తో దుమ్మరేపింది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అదే టైంలో వేరే సినిమాలు కూడా ఏవి లేకపోవడం.. ‘ధమాకా’కు ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. దీంతో రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్నే చెబుతూ చిత్రబృందం పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇక ‘ధమాకా’ వసూళ్లు చూసి రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి మాస్ మహారాజా సినిమా కలెక్షన్స్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
MassMaharaja @RaviTeja_offl ‘s
Bombarding 1️⃣0️⃣0️⃣ CR+..
Reverberating Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/Nb82bElsW1
— People Media Factory (@peoplemediafcy) January 6, 2023