తెలుగు సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన మూవీ దేవుళ్లు. 2000లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. భక్తరసాత్మకంగా రూపొందిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతోగానో ఆదరించారు. అయితే ఈ మూవీలో మీ ప్రేమ కోరే చిన్నారులం.. మీ ఒడిన ఆడే చందమామలం.. అంటూ పాట పాడి తల్లిదండ్రుల ప్రేమ కోసం పరతపించే పాత్రలో నటించారు చైల్డ్ ఆర్టిస్టులు మాస్టర్ నందన్,నిత్యశెట్టి. ఇక నిత్యశెట్టి బాలనటిగా ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించి ఎన్నో ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించిన నిత్యశెట్టి చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకోవడం విశేషం. అయితే ఎన్నో చిత్రాల్లో బాలనటిగా నటించి మెప్పించిన నిత్యశెట్టి ఇప్పడు పెరిగి పెద్దదై హీరోయిన్ గా కూడా రాణిస్తోంది. 2015లో వచ్చిన దాగుడు మూతల దండాకోర్ నుంచి 2020లో వచ్చిన ఓ పిట్టకథ మూవీ వరకు కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది.
ఇది కూడా చదవండి: Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటిటిలో రిలీజ్ అవుతున్న 20 సినిమాలు!
ఇక విషయం ఏంటంటే? నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తుండగా శివ సాయి వర్దన్ దర్శకత్వం వస్తున్న మూవీ హలో వరల్డ్. ఈ మూవీలో నిత్యశెట్టి నిఖిల్, అనిల్ జీలా నటిస్తున్నారు. ఈ మూవీ యూనిట్ తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ పాల్గొని సందడి చేశారు. దేవుళ్లు సినిమాలో బాల నటిగా కనిపించిన నిత్యశెట్టి పెరిగి పెద్దదై అందంగా ముస్తాబవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. పెరిగి పెద్దదై హీరోయిన్ గా నటిస్తున్న ఒక్కప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యశెట్టి సినిమా ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.