టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీశ్రీ ప్రసాద్ స్థానం వేరు. మెలోడీ బాణీలు కొట్టినా, రాక్ మ్యూజిక్ వాయించినా ఆయనకు ఆయనే సాటి. దేవి సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆయనలో సంగీత కళాకారుడే కాదూ.. సింగర్, రైటర్, మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లోనూ ఈ రాక్ స్టార్ బాణీలకు అభిమానులెక్కువే. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టేజ్ షోలు కూడా ఇచ్చారు. పలు సినిమాలకు నంది అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరో అరుదైన అవార్డు ఆయన ఖాతాలో చేరింది.
భారతీయ సినిమాలో సంగీతానికి అత్యుత్తమ సహకారం అందించినందుకు గానూ స్టార్ డస్ట్ అవార్డును అందుకున్నారు. స్టార్ డస్ట్ మ్యాగజైన్ ఈ సంవత్సరం 50వ అవార్డుల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ముంబయిలో జరిగిన స్టార్ డస్ట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ విషయాన్నిఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లెజెండ్స్ తో కలిసి వేదిక పంచుకోవడం, వారి సమక్షంలో అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప-2, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూర్య 42 చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అవార్డుకు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Thank You @Stardust_Magna 4 honouring me wit d prestigious Award “Outstanding Contribution to Music in Indian Cinema”🎶🙏🏻
It was a pleasure being at d 50th ANNIVERSARY CELEBRATIONS of STARDUST in Mumbai, with LEGENDS🙏🏻🎶
Wishing U more Milestone Success forever !🙏🏻 pic.twitter.com/lvN8KYhjVx
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 2, 2023