ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంటవెంటనే వరుస మరణాలతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. దేవీశ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సొదరుడి మరణాన్ని తట్టుకోలేక ఆయన సోదరి, దేవీశ్రీ ప్రసాద్ మేనత్త గుండెపోటుతో మరణించారు. గతంలో తండ్రి కోల్పోయిన సమయంలో దేవీశ్రీ ప్రసాద్ తీవ్ర భావోద్వేగానిక గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు అయినా మరణాలు ఆయనను మరింత వేదనకు గురి చేస్తున్నాయి.