పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు సుకుమార్. ఈ సెలబ్రేషన్ మూడ్ లోనే సుక్కు పుట్టిన రోజు కూడా కలసి వచ్చింది. నేడు సుకుమార్ 52 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్డే విషెస్ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’ పాటకుపేరడీగా ఈ బర్త్డే సాంగ్ సాగుతుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్లు మంచి స్నేహితులు. సుకుమార్ ఒక సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉండాల్సిందే. ఆర్య నుంచి మొదలు మొన్నటి పుష్ప వరకు.. సుక్కు ప్రతి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవీశ్రీ. వీరిద్దరి మైత్ర బంధానికి అభిమానులు కూడా ఫిదా అవుతుంటారు. ఈ పాట వీడియో చూసిన నెటిజనులు.. సూపర్ గా చెప్పావ్ డీఎస్పీ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.