సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య జరిగిన మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివానగా మారుతుందన్నట్లుగా పెద్ద వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా ఓపిక కోల్పోయింది ఎవరు..? ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని మానసికంగా డిప్రెషన్ కి గురయ్యారని మొహం మీదే చెప్పడం ఎంతవరకు కరెక్ట్?
అసలు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని జడ్జి చేయొచ్చా లేదా అనేది ఆలోచించకుండా మాట్లాడటాన్ని పర్సనల్ ఎటాక్ అంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ – దేవిల ఇద్దరిలో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం.. చట్టాన్ని ఉల్లఘించింది ఎవరు? అనే అంశం గురించి వివరిస్తూ.. సామాజికవేత్త బాబు గోగినేని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
TV9 Devi lost completely. She called Viswaksen Mentally ill, then he condemned the words. So, she shouted and thrown him out the debate. @VishwakSenActor
We are supporting Viswaksen. Devi Nagavalli must apologise to Viswak Sen @TV9Telugu
— Censor Reports 💎 (@CensorReports) May 2, 2022
మెంటల్ హెల్త్ యాక్ట్ పై హైకోర్టు న్యాయవాది శ్రీ ప్రమోద్‌రెడ్డి మాట్లాడుతూ.. “మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష.” అన్నారు. లైవ్ టీవీలో నటుడిని నిస్పృహ లేదా మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించడం కరెక్ట్ కాదని.. ఈ విషయంలో యాంకర్ దేవి నాగవల్లి చట్టాన్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్య స్థితిని గురించి మాట్లాడటం అనేది అతని గౌరవానికి సంబంధించిందని తెలిపారు. ఒకవేళ నిజంగానే విశ్వక్ సేన్ మానసికంగా బాగాలేకపోతే అతడిని చర్చకు పిలవడం ఉద్దేశపూర్వక నేరానికి నిదర్శనం” అంటూ యాక్ట్ లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించింది టీవీ యాంకరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి విశ్వక్ – దేవిల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.