ఒక సినిమాని సన్నివేశాలు మరో సినిమాలో కనిపిస్తే అభిమానులే ఇదేం సినిమా రా బాబు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా రిలీజ్ కాకుండానే ఒక కొత్త టెన్షన్ మొదలయింది.
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ట్రిపుల్ తర్వాత తారక్ రేంజ్ ఏ విధంగా మారిపోయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం ఎన్టీఆర్ అందుకున్నాడు. ఈ క్రమంలో తర్వాత తీయబోయే సినిమా కూడా అంతే గ్రాండ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం .. కొరటాల దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియాగా రిలీజవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రిపుల్ తర్వాత ఈ సినిమా రానుండడంతో ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడొక విషయం తారక్ అభిమానులని కాస్త ఆందోళనకి గురి చేస్తుంది.
ఎన్టీఆర్ కొరటాలది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరూ నటించిన జనతా గ్యారేజ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు ఒక్క ఆచార్య మినహా.. కొరటాల నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే వీటన్నిటీకి మించి ఆచార్య సినిమా భారీ అంచనాల మీద వచ్చి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి కొరటాల శివతో సినిమా అంటే స్టార్ హీరోలు వెనకడుగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కొరటాలకి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు కొరటాల తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేశారు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేయగా.. అభిమానులు ఆశించినట్లుగానే తారక్ ఊరమస్ లుక్ లో అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ ఉండనుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఓ భారీ టెంపుల్ సెట్ లో ఫైట్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొరటాల ఆచార్య సినిమాలో కూడా ఒక భారీ టెంపుల్ వేయడం.. ఇప్పుడు లీకైన ఫోటో కూడా టెంపుల్ సెట్ కావడంతో ఆచార్య వైబ్స్ ఏమైనా కనిపిస్తాయా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలే ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల.. అలాంటి ఫలితాన్ని మరోసారి రిపీట్ చేస్తాడా అని ఫ్యాన్స్ లో ఏదో మూల చిన్న భయం ఉండడం కామన్. ఇకపోతే ఈ ఫోటోలు మరింత వైరల్ అవ్వకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు పడుతున్నారు. మరి కొరటాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.