నందమూరి తారకరత్న.. కొద్దిరోజులుగా ఈ పేరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత 23 రోజులుగా ఐసీయూ బెడ్ పై క్రిటికల్ కండీషన్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ.. ఇటీవల తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో.. తారకరత్న వ్యక్తిగత జీవితం, ఆయన భార్యకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజనులు ఆసక్తి చూపుతున్నారు.
నందమూరి తారకరత్న.. కొద్దిరోజులుగా ఈ పేరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జనవరి 27న లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం వెళ్లిన తారకరత్న.. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం.. తారకరత్నను బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. గత 23 రోజులుగా ఐసీయూ బెడ్ పై క్రిటికల్ కండీషన్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ.. ఇటీవల తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతితో నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే ఇలా కన్నుమూయడంతో తారకరత్న ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. తారకరత్న వ్యక్తిగత జీవితం, ఆయన భార్యకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజనులు ఆసక్తి చూపుతున్నారు.
ఆ వివరాలు.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బంధువు అనే విషయం తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. అయితే వీరి వివాహానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదట. దాంతో వీరు పెద్దలను ఎదిరించి మరి.. వివాహం చేసుకున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే అలేఖ్యారెడ్డికి వివాహం అయ్యి.. భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అలేఖ్య రెడ్డి తమ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..
‘‘తారక రత్న చెన్నైలోని మా సిస్టర్‌కి స్కూల్‌లో సీనియర్. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మేము హైదరాబాద్‌లో కలిశాం. వాస్తవానికి మేము ప్రారంభం నుంచి మంచి స్నేహితులుగానే ఉన్నాం. కానీ ఆ తర్వాత.. మా మధ్య ప్రేమ చిగురించింది. అయితే తారకరత్న మొదట నాకు ప్రపోజ్ చేశారు. అప్పుడు నేను ముందు మా అమ్మానాన్నలతో మాట్లాడమని తనకి చెప్పాను. తారకరత్న నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పగానే మా వాళ్లు నో చెప్పారు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీపై మా తల్లిదండ్రులకు మంచి అభిప్రాయం లేదు’’ అని చెప్పుకొచ్చారు అలేఖ్యారెడ్డి.
అలానే నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. అందుకు గల కారణాల్ని కూడా వివరించారు అలేఖ్య రెడ్డి. ‘‘తారక రత్న ఫ్యామిలీ కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదు. దానికి కారణం.. నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాను. అయితే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. కానీ తారకరత్న ప్రవర్తన నచ్చి.. తన ప్రేమకు ఎస్ చెప్పాను. ఇక ఆ సమయంలో మా అంకుల్ విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిలిచారు. మేము 2012, ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నాం. అయితే మా పెళ్లికి ఇరు వైపుల పెద్దలు ఎవరూ రాలేదు’’ అని తెలిపారు అలేఖ్యారెడ్డి. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి.
తారక రత్న, అలేఖ్య రెడ్డికి 2013లో నిష్కా అనే పాప పుట్టింది. వివాహం అయిన తర్వాత కూడా చాలా రోజుల వరకూ ఇటు నందమూరి ఫ్యామిలీ, అటు అలేఖ్య ఫ్యామిలీ వీరితో మాట్లాడలేదట. అయితే.. నాలుగేళ్ల తర్వాత తారక రత్న బర్త్‌డే సందర్భంగా అందరూ కలిసినట్లు అలేఖ్య రెడ్డి గుర్తు చేసుకున్నారు. దివంగత నందమూరి హరికృష్ణ సోదరుడైన నందమూరి మోహన్ కృష్ణ కుమారుడే ఈ తారకరత్న. ఇప్పుడు తారకరత్న మృతి వార్తతో నందమూరి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.