గీతూ రాయల్.. బుల్లితెర, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి, బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. మొదట గలాటా గీతూ పేరిట బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఉండేది. ముఖ్యంగా ఆమె చిత్తూరు యాసకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇటీవల జబర్దస్త్, బుల్లితెరలో స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ బాగానే పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. సరిగ్గా నెలక్రితం ఓ అమెజాన్ డెలివరీ ఏజెంట్ చేసిన నిర్వాకాన్ని సాక్షాలతో సహా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. అలాంటి జాగ్రత్తా అంటూ తన ఫాలోవర్స్ ను కూడా హెచ్చరిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. గీతూ తరచూ అమెజాన్ లో షాగింప్ చేస్తూ ఉంటుందని తెలిపింది. అయితే నెలక్రితం తన ఆర్డర్ డెలివర్ చేసేందుకు ఓ అమెజాన్ డెలివరీ ఏజెంట్ తమ ప్లాట్ కు వచ్చాడు. అతను ఆర్డర్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఇంటి బయట ఉన్న ఆమె షూలను దొంగిలించినట్లు గలాటా గీతూ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది.
ఇది జరిగి సరిగ్గా నెలరోజులు గడుస్తున్నా.. ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని గీతూ ఆరోపిస్తోంది. తనకు జరిగిన ఘటనను వివరిస్తూ.. ‘ఓ అమెజాన్ డెలివరీ ఏజెంట్ నా షూస్ దొంగిలించాడు. దానిపై నేను ఆ సంస్థకు కంప్లైంట్ కూడా చేశాను. కానీ, ఇప్పటివరకు ఆ సంస్థ నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. అందుకే ఇలా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నాను. అందరూ అలాంటి వారే అని నేను అనడం లేదు. కానీ, ఇలాంటి వారు కూడా ఉంటారు అనేది గ్రహించి జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హెచ్చరిస్తోంది. గీతూకి జరిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.