రౌడీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం ‘లైగర్’ మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ నటన.. అభిమానులను ఆకట్టుకుంది. ఈ రౌడీ హీరోకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే క్లాస్ హీరోగా ఉన్న విజయ్ ని ‘అర్జున్ రెడ్డి’ మూవీ మాస్ హీరోను చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన సమయంలో అనేక రికార్టులు బద్దలు కొట్టింది. ఇందులోని ప్రతి సీన్ ఆడియాన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ వచ్చి..ఏళ్లు గడుస్తున్న ఫ్యాన్స్ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని డిలీడ్ సీన్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. అవి ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రౌడీ హీరో విజయ్, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. తెలుగులో గేమ్ ఛేంజర్ మూవీగా అర్జున్ రెడ్డి రికార్డు క్రియేట్ చేసింది. ఒకప్పుడు టాలీవుడ్ పరిశ్రమ అంటే ‘శివ’ ముందు, తరువాత అన్న రేంజ్ లో మారిపోయింది. శివ సినిమా ఆ రేంజ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. చాలా ఏళ్ల తరువాత “అర్జున్ రెడ్డి” సినిమాతో టాలీవుడ్ లో మరో మార్పు వచ్చింది.
ఒక ఫార్ములాలో వెళ్తున్న తెలుగు సినిమాల కథను అర్జున్ రెడ్డి మూవీ మార్చేసింది. వెరైటీ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మాస్ ఆడియాన్స్ ను , యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాతో విజయ్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఓ రేంజ్ ఉంటుంది. విజయ్ మాస్ నటన, షాలినీ అమయకత్వం మాములుగా ఉండదు. ఇక హీరో హీరోయిన్ మధ్య సాగే రోమాన్స్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరో ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ అద్భుతంగా నటించాడు. ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలని అనేలా రామకృష్ణ నటన ఉంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సీన్లు సినిమాలో కనిపించలేదు. ఆ డిలీడ్ అయిన సీన్ తాజాగా బయటకి వచ్చింది. ప్రస్తుతం ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.