Ketaki Chitale: కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన లేదా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం కారణంగా వివాదాల్లో చిక్కుకొని, జైలు పాలవుతుంటారు సినీ సెలబ్రిటీలు. అందులోనూ పవర్ లో ఉన్న రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే.. ఖచ్చితంగా మున్ముందు రానున్న ఒడిదుడుకులను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
ఆ విధంగా ఇటీవల ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్ పై అవమానకర రీతిలో పోస్టులు పెట్టిందనే ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా ఫేస్ బుక్ లో శరద్ పవార్ పై అభ్యంతకర పోస్టులు చేసిందనే కారణంతో కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన దాదాపు 40 రోజుల తర్వాత మహారాష్ట్ర థానే జిల్లాలోని కోర్టు బుధవారం (జూన్ 22) బెయిల్ జారీ చేసినట్లు సమాచారం.
అదికూడా రూ. 20 వేల పూచీకత్తు పై ఆమెకు జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్ బెయిల్ ఇచ్చారని తెలుస్తుంది. కేతకిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం), 500 (పరువు నష్టం), 501 (పరువు నష్టం కలిగించే విషయాన్ని ముద్రించడం, ప్రస్తావించడం), 153 ఏ మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి కేసులు నమోదయ్యాయి.
ఇక శరద్ పవార్ పై మరాఠీ కవితను ఉదహరిస్తూ రాసిన ఆ పోస్టులో ‘నరకం ఎదురు చూస్తోంది’, ‘మీకు బ్రాహ్మణులంటే ద్వేషం’ అనే అర్థం వచ్చే కొన్ని పదాలు వాడింది కేతకి. ఆయనపై అనుచిత పోస్టులు పెట్టిందన్న ఆరోపణలతో కేతకి సుమారు 20కు పైగా ఫిర్యాదులను ఫేస్ చేస్తోంది. కేతకి థానే ఇక సెంట్రల్ జైలు నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Maharashtra: Thane Court grants bail to actress #KetakiChitale.
Actress Ketaki Chitale was arrested for sharing multiple tweets allegedly aimed toward NCP chief @PawarSpeaks. pic.twitter.com/zG0JH6GO7u
— Organiser Weekly (@eOrganiser) June 22, 2022