తెలుగు బుల్లితెరపై తన అందచందాలతో కుర్రాళ్ల మనసు దోచిన బ్యూటీ దీప్తీ సునైనా. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెలియని వారు ఉండరు. యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన ఈ చిన్నది తన అందం, యాక్టింగ్, డ్యాన్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో దీప్తి సునైనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
దీప్తీ సునైనా యూట్యూబ్ లో పలు వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొని తన ఆటపాటలు, హీరో తనిష్ తో లవ్ ట్రాక్ తో అలరించింది. అప్పట్లో ఈ అమ్మడిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దీప్తీ సునైనా అప్పుడప్పుడు తన కాంట్రవర్సీలతో నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురి అవుతుంది.. కొన్నిసార్లు నెటిజన్ల ప్రశ్నలకు స్ట్రాంగ్ గా సమాధానాలు కూడా చెబుతుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
ఇటీవల షన్నుతో బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా తన ఫ్రెండ్స్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఒంటరితనాన్ని దూరం చేసుకుంటుంది. సమయం చిక్కినపుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఈ క్రమంలో తన అభిమానులతో ముచ్చటిస్తున్న దీప్తి సునైనాకు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. మీరు కొత్త ఇంట్లోకి మారిపోయారా? అని నెటిజన్ ప్రశ్నకు అవును అని సమాధానం చెప్పింది. మీరు చెన్నైకి ఎప్పుడు వస్తున్నారు అన్న ప్రశ్నకు.. త్వరలో వస్తాను అని సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇల్లు ఎలా కొన్నావ్.. అంత డబ్బు ఎలా వచ్చింది? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దాంతో ఆ నెటిజన్ కి సరైన సమాధానం ఇచ్చింది దీప్తి సునైనా.
యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నాకు వచ్చిన సంపాదనలో ముప్పైశాతం ఖర్చుచేసుకొని.. డెబ్బై శాతం సేవ్ చేసుకుంటున్నాను. అలా దాచుకున్న డబ్బుతో ఇల్లు కొన్నా అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పి నోరు మూయించింది. మొత్తానికి హైదరాబాద్ లో తన సొంత డబ్బుతో ఓ ఖరీదైన ఇల్లు కొన్న దీప్తీ సునైనా ఈ లెక్కన బాగానే డబ్బు సంపాదిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.