Deepthi Sunaina: బిగ్ బాస్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో దీప్తి సునైనా ఒకరు. బిగ్ బాస్ కి ముందు మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్లపాటు వీరు ప్రేమలో ఉండి.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్రేకప్ అనౌన్స్ చేసి వార్తల్లో నిలిచారు. కానీ.. దీప్తి, షణ్ముఖ్ జోడికి ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. మొత్తానికి వీరి లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టేశారు.
ఇక బ్రేకప్ తర్వాత దీప్తి తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే.. దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాదాపు 3.8 మిలియన్స్ కి పైగా ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత బ్రేకప్ అయ్యాక చాలా రోజులు సైలెంట్ గా ఉన్న దీప్తి.. యూట్యూబ్ ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మళ్లీ యాక్టింగ్ రీస్టార్ట్ చేసి.. ఫామ్ లోకి వచ్చింది.
ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే.. లవ్ లో ఉన్నప్పటికంటే డోస్ ఎక్కువగా ఉన్న పిక్స్, ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా లవ్ పై ఓ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా మారింది దీప్తి. ఉన్న లవ్ నే బ్రేకప్ చేసుకున్నాక ఇంకేం చెప్పిందనే డౌట్ రావచ్చు. కానీ.. దీప్తి పోస్ట్ కి మీనింగ్ అర్థమైతే ప్రేమపై ఆమె ఉద్దేశం ఏంటనేది తెలుస్తుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ లో విరాటపర్వం సినిమాకు సంబంధించి ఒక డైలాగ్స్ షేర్ చేసుకుంది.ఆమె పోస్టులో ఏముందంటే.. “ఎవరిని ఎవరు ప్రేమించరని.. మనల్ని మనం ప్రేమించుకోవడం నిజం.. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబద్దం” అని డైలాగ్ దీప్తి షేర్ చేసింది. దీంతో దీప్తికి ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయిందనే విషయం చెప్పకనే చెప్పిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి లవ్ పై దీప్తి సునైనా పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.