సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అంతమంది ఉంటారో లేదో తెలియదు గానీ ఒకరిద్దరు మాత్రం తారసపడుతుంటారు. ఇదివరకంటే న్యూస్ లో చూసేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియా ఉందిగా.. ఏ ఇబ్బంది లేకుండా ఒక్క సెల్ఫీ దొరికితే చాలు. ఏ హీరో, ఏ హీరోయిన్ తో పోలి ఉన్నారనే ఆసక్తి బయటపడుతుంది. మామూలుగానే హీరోయిన్ల లుక్కుకి దగ్గరగా అమ్మాయిలు, హీరోలను మరిపించే స్టైల్ లో అబ్బాయిలు కనిపించేందుకు ట్రై చేస్తుంటారు.
టాలీవుడ్ లో ఆ మధ్య అషు రెడ్డిని సమంతకు డూప్ అంటూ ప్రచారం చేశారు. అలా మరో అమ్మాయి కూడా సమంత లాగా కనిపించి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇక ఆ విషయం పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ త్రిషను పోలిన అమ్మాయి వెలుగులోకి వచ్చింది. కాస్త అటు ఇటుగా త్రిషను పోలి ఉన్న ఈ అమ్మాయి పేరు దీపిక విజయ్. కర్ణాటకకు చెందిన ఈ అమ్మాయి దాదాపు త్రిషను పోలి ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ భామ త్రిషకు డూప్ అంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషను బాగా ఆరాధించి అభిమానించేవారు ఈ అమ్మాయిని త్రిష కాదని గుర్తించగలరు. కానీ.. మిగిలిన వారు చూసిన వెంటనే దాదాపు త్రిష అనే అనుకుంటారు. త్రిష మాదిరిగానే డ్రెస్, హెయిర్ స్టైల్ తో పాటు బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ జాగ్రత్త పడుతోంది. ఇక ఇప్పుడు త్రిషను పోలిన ఈ దీపిక విజయ్.. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకుని.. త్రిష అభిమానులను ఆకట్టుకుంటోంది. మరి దీపిక విజయ్ గురించి రియల్ త్రిషకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ఈ డూప్ త్రిషపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.