ఇటీవల వినోదాన్ని అందించేందుకు టీవీ షోలకు పోటీగా తయారవుతున్నాయి ఓటిటి షోలు. ఇదివరకే సెలబ్రిటీ టాక్ షోలైనా, కామెడీ షోలైనా కేవలం బుల్లితెర ఛానల్స్ పేరు మాత్రమే వినిపించేవి. కానీ.. ఇప్పుడలా కాదు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఎంటర్టైన్ మెంట్ ని ఓటిటిలలో కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఆహా అందుబాటులో ఉంది. సినిమాలతో పాటు పలు ఎంటర్టైన్ మెంట్ షోలు అందిస్తున్న ఆహా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ‘కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్’ అనే షో కూడా నిర్వహిస్తోంది. ఈ షోని సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి హోస్ట్ చేస్తున్నారు.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా కామెడీ ఎక్స్ చేంజ్ షో నుండి మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. కాగా.. జనవరి 6న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం సందడిగా సాగింది. అయితే.. షో ప్రారంభంలో సుధీర్, దీపికాల ఇంట్రో డాన్స్ మాత్రం హైలైట్ గా మారింది. స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో ఇద్దరు మాంచి కిక్కిచ్చే డాన్స్ చేశారు. పైగా వీరిద్దరూ కలిసి ఇదివరకే ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమాలో సుధీర్, దీపికా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా జనాలు చూసి ఎంజాయ్ చేశారు. మరి అప్పుడు ఆ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యిందో.. ఇప్పుడు ఈ షోలో కూడా వారిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సుధీర్, దీపికాల ఫుల్ పెర్ఫార్మన్స్ చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరి సుధీర్, దీపికా జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.