టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.
ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ;అబ్బా అబ్బా అబ్బబ్బ; అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే.. నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లను జోడించి.. దర్శకేంద్రుడి స్టైల్ లో హీరోయిన్స్ అందాలను క్యాచీగా చూపించారు మేకర్స్. ఈ పాట చూస్తే ఖచ్చితంగా రాఘవేంద్రరావు మార్క్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకు వస్తాయి.
ఇదిలా ఉండగా.. ఈ పాటలో సుడిగాలి సుధీర్ జోడిగా దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ కి జోడిగా విష్ణుప్రియ చేసిన హాట్ షో హైలైట్ అవుతున్నాయి. ఈ పాటలో సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, దీపికా పిల్లి, నిత్యాశెట్టి, విష్ణుప్రియ, వాసంతి జోడిలుగా కనిపించారు. ప్రస్తుతం పండుగాడ్ మూవీలోని ఈ గ్లామరస్ సాంగ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి దీపికా పిల్లి, విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.