హీరోయిన్ దీపికా పదుకొనె 95వ అకాడమీ అవార్డు వేడుకలో సందడి చేశారు. అవార్డు ప్రసెంటర్‌గా ఆమెను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి ఆమెకు ఘోర అవమానం జరిగింది.
95వ అకాడమీ అవార్డు వేడుక మార్చి 12న రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 23 క్యాటగిరీల్లో అకాడమీ అవార్డులను ప్రకటించింది. భారత్ ముందెన్నడూ లేని విధంగా ఆస్కార్ అవార్డుల్లో తన సత్తా చాటింది. మొత్తం రెండు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు రాగా.. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు కూడా ఆస్కార్ వచ్చింది. ఇక, ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అవార్డు ప్రెసంటర్‌గా ఈ వేడుకలో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
um, getty images this is deepika padukone. you appear to have confused her with camila alves.
deepika’s actually quite famous in her own right – 72 million insta followers and an award-winning career.#Oscar #Oscar2023 pic.twitter.com/0kQPjOce51
— Tarang / तरंग (@tarang_chawla) March 13, 2023
బిగ్గెస్ట్ గ్లోబల్ ఈవెంట్‌లో దీపికా దేశీ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చి.. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందంగా మెరిశారు. అంతేకాదు! నాటు నాటు పాటను స్టేజీ మీద ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడనున్న అతిధుల్లో 90 శాతం మందికి ఆమె ఎవరో తెలుసు. అలాంటి ఆమెకు గుర్తింపు విషయంలో ఘోర అవమానం జరిగింది. కొన్ని ఫొటో, మీడియా సంస్థలు ఆమెను గుర్తించటంలో దారుణంగా విఫలయ్యాయి. ఆమె పేరుకు బదులు మరో నటి కెమిలా ఏవ్స్ పేరును రాశారు. దీపికాను, కెమిలాను పోల్చుకోలేకపోయిన సదరు సంస్థలు ఈ విధంగా దారుణమైన తప్పును చేశాయి. ఆస్కార్ వేడుకకు అతిధిగా వచ్చింది ఎవరో సరిగా తెలుసుకోకుండానే దీపికా పేరుకు బదులు కెమిలా పేరును వేశాయి.
I’m crying at @BuzzFeed 😭 this is giving unprofessionalism, ignorance and racism.
ask your bloggers to research and review before posting stuff. This is Deepika Padukone. pic.twitter.com/Ok3MVQtL63
— rahul🌻 | selena always 💜 (@selg_simp) March 13, 2023
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు దీన్ని తీవ్ర స్థాయిలో తప్పు బడుతున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా వెలుగొందుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న దీపికాను గుర్తించలేకపోవటం బాధాకరమని అంటున్నారు. సదరు ఫొటో, మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆస్కార్ వేడుకల సందర్భంగా దీపికాకు ఘోర అవమానం జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.