సినీ ఇండస్ట్రీలో ఎవరు సినిమా చేసినా హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తుంటారు. అందుకోసం సినిమా జానర్, క్యారెక్టర్ బట్టి.. ఎంతో కష్టపడుతుంటారు నటీనటులు. స్టార్ యాక్టర్స్ నుండి యంగ్ స్టర్స్ వరకూ సినిమాల కోసం కష్టపడటం.. మంచి రోల్.. మంచి రెమ్యూనరేషన్ ఇవన్నీ మామూలే. కానీ.. చేసిన సినిమా హిట్టు అయినప్పుడు వచ్చే ఆనందం వేరే లెవల్ లో ఉంటుంది. సినిమాలు ప్లాప్ అయితే మిగతా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే. పైగా హిట్టు కొట్టి.. చాలా కాలమైతే.. సినిమా హిట్ అని వచ్చే టాక్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టం కష్టమే.. కానీ, సక్సెస్ ఇచ్చే ఆనందం ముందు కష్టం ఏమాత్రం కూడా దృష్టిలోకి రాదని అంటుంటారు.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. అలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్‘ సినిమా.. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా హీరోయిన్ గా నటించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. విజువల్ గ్రాండియర్ గా పఠాన్ ని తెరపై ప్రెజెంట్ చేశాడు. అయితే.. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ నుండి బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న పఠాన్.. 6 రోజుల్లో సుమారు రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది. తాజాగా ముంబైలో పఠాన్ టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న దీపికా.. మూవీ రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. “సినిమా రిలీజ్ రోజే థియేటర్స్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూడాలని అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈరోజు మీ ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నిజంగా ఓ పండుగలా ఉంది. నిజాయితీతో, చిత్తశుద్ధితో కష్టపడితే ఇలాంటి ప్రేమ, ఆదరణ లభిస్తాయని మరోసారి పఠాన్ ప్రూవ్ చేసింది” అంటూ దీపికా కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం దీపికా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పఠాన్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.