చిత్రపరిశ్రమలో నటీనటులు వారి సహనటులతో ప్రేమలో పడటం అనేది మామూలు విషయమే. కొందరు ఒకే సినిమాలో కలిసి నటించడంతో అట్రాక్ట్ అవుతారు. ఇంకొందరు ఎక్కడో పార్టీలో, మీటింగ్స్ లో కలిసి ఇష్టపడతారు. ఇలాంటి జాబితాలో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలామంది ఉంటారు. అయితే.. ఇష్టపడటం, ప్రేమలో పడటం పెద్ద విషయం కాదు.. పెళ్లి వరకు వెళ్లి, ఆ తర్వాత కలిసి ఉన్నారా లేదా? అనేది పాయింట్ అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీ జంటలను చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే మనస్పర్థలని, మా దారులు వేరని విడాకులు తీసుకుంటున్నారు.
ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో మరో యంగ్ హీరోయిన్ సహనటుడితో డేటింగ్ చేస్తుందని, అతనితో ప్రేమలో ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగులో ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ నీతి టేలర్. ‘మేం వయసుకు వచ్చాము’ మూవీతో డెబ్యూ చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ సినిమాలు చేసింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో బాలీవుడ్ లో సీరియల్ చేస్తూ సెటిల్ అయిపోయింది. అయితే.. సినిమాల్లోకి రాకముందు నుండే సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్న నీతి.. తెలుగులో మాత్రమే సినిమాలు చేయడం విశేషం. ఆ తర్వాత 2019లో తన బాయ్ ఫ్రెండ్ పరిక్షిత్ భవాతో ఎంగేజ్మెంట్ చేసుకొని.. 2020లో పెళ్లి చేసుకుంది.
ఇదిలా ఉండగా.. పెళ్లయ్యాక కూడా వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తోంది. తాజాగా నీతి నటించిన ‘కైసే యే యారియాన్ 4’ ప్రోమో విడుదలైంది. ఈ సిరీస్ లో నటుడు పార్థ్ సమదాన్ కి జంటగా నీతి నటించింది. ఇప్పటికే మూడు సీజన్ల నుండి హిట్ పెయిర్ అనిపించుకున్న కైసే యే యారియాన్ సీజన్ 4 ప్రోమో ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఇదే సీజన్ నుండి నీతి – పార్థ్ ల రొమాంటిక్ సీన్ ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ లీకైన వీడియో క్లిప్ చూసినవారంతా.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి డేటింగ్ లో ఉన్నారని భావిస్తున్నారు. అంతేగాక బాలీవుడ్ వర్గాలు కూడా నీతి నిజంగానే పార్థ్ తో డేటింగ్ లో ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. పెళ్ళైనా కాకపోయినా హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే.. ఈజీగా ఒక జడ్జిమెంట్ కి వచ్చేస్తున్నారు నెటిజన్స్. నీతికి ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ పరిక్షిత్ తో రెండేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా ఎలా సహనటుడితో డేటింగ్ ఉందంటూ పుకార్లు రేపుతారని నీతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనంతటికి నీతి, పార్థ్ ల రొమాంటిక్ వీడియో క్లిప్ అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. కానీ.. పెళ్ళైనా విడాకులు తీసుకోకుండా ఈ మధ్య సెలబ్రిటీలు ఇంకొకరితో డేటింగ్ చేయడం చూస్తూనే ఉన్నాం కదా! అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి నీతి – పార్థ్ ల విషయం ఎంతవరకు వెళ్తుందో!