ఈమె అవార్డ్ విన్నింగ్ హీరోయిన్. గ్లామర్, రస్టిక్, లేడీ ఓరియెంటెడ్.. ఇలా ఏ పాత్ర అయినా చేస్తుంది. మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
తెలుగు ప్రేక్షకులు నిజంగా చాలా గొప్పోళ్లు. ఎంతలా అంటే ఏదైనా సినిమా నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు. ఒకవేళ బాగోలేకపోతే మాత్రం ట్రోల్ చేయడానికి అస్సలు వెనకాడరు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కూడా సేమ్ అలాంటిదే. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హిట్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఇక చూసుకోండి. ఫ్లాప్ సినిమాలతో దండయాత్ర చేసింది. ఏకంగా అరడజనుకి పైగా మూవీస్ ఫెయిలయ్యాయి. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
అసలు విషయానికొస్తే.. తెలుగులో ఉన్న హీరోయిన్లు అందరూ దాదాపుగా బయట రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లే. అందులో చాలామంది సరైన సినిమాల పడకపోవడం వల్ల ఫేడౌట్ అయిపోతుంటారు. మరికొందరు మాత్రం పాతుకుపోతుంటారు. కొందరైతే ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టేస్తుంటారు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అలాంటి బ్యూటీనే. పేరు కీర్తి సురేష్. రీసెంట్ గా ‘దసరా’తో హిట్ అందుకున్న ఈమె కెరీర్ లో బోలెడన్ని ఫ్లాప్స్ ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు.
హీరోయిన్ మేనక కూతురు కీర్తి సురేష్. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమావాళ్లే కావడంతో చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలోనే పెరిగింది. ఎనిమిదేళ్లకే స్క్రీన్ పై కనిపించింది. 21 ఏళ్లకు మలయాళంలో హీరోయిన్ గా పరిచయమైంది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2016లో ‘నేను శైలజ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నేను లోకల్’తో యావరేజ్ హిట్ అందుకుంది. ఆ వెంటనే ‘అజ్ఞాతవాసి’తో ఘోరమైన ఫ్లాప్ ఫేస్ చేసింది. దీని తర్వాత చేసిన లీడ్ రోల్ లో ‘మహానటి’ చేసింది. అది ఏకంగా ఈ బ్యూటీకి జాతీయ అవార్డు తీసుకొచ్చింది. దీని తర్వాత అరడజనుకి పైగా ఫ్లాప్స్ అందుకుంది. రీసెంట్ గా ‘సర్కారు వారి పాట’, ‘దసరా’తో హిట్ ట్రాక్ ఎక్కింది. సో అదన్నమాట విషయం. మరి ఈమె చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.