'దసరా' సక్సెస్ తో నిర్మాత ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే ఊపులో డైరెక్టర్ కి అన్ని లక్షల విలువైన BMW కారు గిఫ్ట్ గా ఇచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాని ‘దసరా’ హిట్ అయిపోయింది! రోజురోజుకీ వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే.. అదే అనిపిస్తుంది. మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. నాలుగురోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.87 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ.. 100 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. అందరి ఫీలింగ్ ఏంటో గానీ.. ప్రొడ్యూసర్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఊపులో దర్శకుడితోపాటు సినిమా కోసం పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ అందరినీ కూడా ఖరీదైన గిఫ్ట్ లతో ఖుషీ చేశారట. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో నాని ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటించిన మూవీ ‘దసరా’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హీరోహీరోయిన్ల యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూ ఫిదా అయిపోయారు. కట్ చేస్తే శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు.. ఈ చిత్రంతో దర్శకుడు అయ్యారు. కానీ మూవీ చూస్తే మాత్రం అలా అనిపించదు. టాలీవుడ్ కు మరో మంచి డైరెక్టర్ దొరికేసినట్లే అనిపిస్తుంది. మరోవైపు గత ఐదు సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన నిర్మాత సుధాకర్ చెరుకూరి.. ‘దసరా’తో మంచి లాభాల్లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నారు.
‘దసరా’ హిట్ తో తెగ ఆనందపడిపోతున్న నిర్మాత.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు దాదాపు రూ.80 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా కరీంనగర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కారు తాళాన్ని బహుకరించారు. ఈ మూవీ కోసం పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా అందజేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అప్పుడే శ్రీకాంత్ తర్వాతి సినిమా గురించి పుకార్లు మొదలైపోయాయి. అక్కినేని అఖిల్ తో ఉండబోతుందని, మహేష్ తోనూ ఓ మూవీ చేయనున్నాడని అంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘దసరా’ ప్రొడ్యూసర్.. డైరెక్టర్ కి కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారనే దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.