మాస్ స్టోరీతో తీసిన 'దసరా'.. థియేటర్లలో దుమ్మురేపుతోంది. దీంతో తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. నాని కెరీర్ లోనే ఈ మూవీ ఫస్డ్ డే వసూళ్లతో రికార్డ్ సృష్టించింది!
గత కొన్నిరోజులుగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన సినిమా ‘దసరా’. నేచులర్ స్టార్ నాని, కీర్తి సురేష్ తదితరులు లీడ్ యాక్టర్స్ కావడం, ట్రైలర్ కూడా క్రేజీగా ఉండటంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. తాజాగా థియేటర్లలోకి ఈ సినిమా పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. అక్కడక్కడ పలు సినిమాల షేడ్స్ కనిపించాయని అంటున్నారు కానీ ఎవరూ బాగోలేదని అనడం లేదు. ఇలా అన్నిచోట్ల ఆకట్టుకుంటున్న ‘దసరా’ తొలిరోజు వసూళ్లలో దుమ్మురేపింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అలానే విదేశాల్లో ధూమ్ ధూమ్ కలెక్షన్స్ రికార్డులు కూడా సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘దసరా’లో నాని నటవిశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్ ఉన్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ఇక క్లైమాక్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ఇలా అంతా పాజిటివ్ గా ఉన్న ఈ మూవీకి వసూళ్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. నాని అయితే చాలాచోట్ల ఇప్పటివరకు తన పేరిట ఉన్న కలెక్షన్స్ మార్క్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. నైజాంలోనూ చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ తొలిరోజు కలెక్షన్స్ ని బీట్ చేసిన నాని ఫస్డ్ డే కలెక్షన్స్ లో అరుదైన ఘనత సాధించాడు.
ఆంధ్రా-తెలంగాణ తొలిరోజు షేర్ – రూ 14.5 కోట్లు
ఆంధ్రా-తెలంగాణ గ్రాస్ – రూ 26 కోట్లు
ఓవర్సీస్-మిగతా భాషల గ్రాస్ – రూ 12 కోట్ల ప్లస్!
వరల్డ్ వైడ్ తొలిరోజు గ్రాస్ – రూ 38 కోట్లకు పైగా వచ్చాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి నాని కెరీర్ లో అత్యధికంగా ‘దసరా’కు ఈ రేంజ్ వసూళ్లు రావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#Dasara emerges as the #1 MOVIE at the Indian Box Office with a gross of 38 CRORES+ on Day 1 💥💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbusterDasara
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/tD2icNehv5— SLV Cinemas (@SLVCinemasOffl) March 31, 2023