'దసరా' తొలిరోజు కలెక్షన్స్ లో మంచి ఊపుమీద కనిపించింది. రెండో రోజు ఆ జోరు కాస్త తగ్గినప్పటికీ.. వసూళ్లలో ఆ మార్క్ ని చేరుకుంది. దీంతో నాని సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
నేచురల్ స్టార్ నాని అస్సలు ఆగట్లేదు. ‘దసరా’తో హిట్ కొట్టడం సంగతి అటుంచితే పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. వసూళ్లలోనూ అస్సలు తగ్గట్లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసిన నాని.. రస్టిక్ మాస్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇందులో నాని డిఫరెంట్ షేడ్స్ లో చేసిన యాక్టింగ్ అయితే అందరికీ తెగ నచ్చేస్తుంది. అందుకు తగ్గట్లే తొలి రెండు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. నాని కెరీర్ లో ఇదే హైయస్ట్ కూడా.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు నాని అనగానే అందరికీ పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ గుర్తొచ్చేవి. ‘దసరా’తో దాన్ని బ్రేక్ చేయడమే కాదు.. పాన్ ఇండియా హీరో అయిపోయాడనే చెప్పాలి. సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు నుంచే దేశం మొత్తం తిరుగుతూ హైప్ పెంచిన నాని.. ఇప్పుడు దాని ఫలితాన్ని చూస్తున్నాడు. తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘దసరా’.. రెండు రోజు వచ్చేసరికి రూ.50 కోట్ల మార్క్ ని దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించింది.
రిలీజ్ రోజు రూ.38 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ‘దసరా’.. రెండో రోజు రూ.15 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల వసూళ్లు కలిపి రూ.53 కోట్లకు పైగా వచ్చాయని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. నాని సినిమాలకు ఇప్పటివరకు టోటల్ కలెక్షన్స్ 50 కోట్లు దాటలేదు. అలాంటిది రెండు రోజుల్లోనే ఆ మార్క్ చేరుకోవడమే కాదు.. త్వరలో రూ.100 కోట్ల మార్క్ ని చేరుకుంటాడనిపిస్తోంది. సరే ఇదంతా వదిలేయండి.. ‘దసరా’ మీలో ఎంతమంది చూశారు? ఒకవేళ చూస్తే ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి.
#Dasara‘s MASS RAMPAGE at the Box Office ❤️🔥
53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir— SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023