దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం RRR.ఈ మధ్య కాలంలోనే విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ.1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును నెలకోల్పింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ నటనకు, రామ్ చరణ్ విశ్వరూపానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ఈ సినిమాపై డార్లింగ్ ప్రభాస్ కాస్త ఆలస్యంగా స్పందించాడు.
ఇది కూడా చదవండి: ఇండియన్ సినిమాపై టాలీవుడ్ మార్క్! ఫ్యూచర్ అంతా మనదే!
ప్రభాస్ తాజాగా ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను RRR సినిమాని చూశానని, చాలా బాగా నచ్చిందని అన్నారు. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన కొన్ని చిత్రాల్లో RRR సినిమా ఒకటని స్పష్టం చేశారు. ఈ చిత్రం గొప్ప అనుభూతిని మిగిల్చిందని, దాదాపు 10 సీన్స్ లలో నా కళ్లలో నీళ్లు తిరగాయని తెలిపారు. 50 సన్నివేశాలు నన్ను కట్టిపడేశాయని ప్రభాస్ అన్నారు. RRR సినిమాపై ప్రభాస్ లేట్ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.