యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా సలార్ షూటింగ్ దశలోనే రికార్డులకు వేదికవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాలో వాడే టెక్నాలజీ ఇండియాలో మొదటి సారి వాడుతున్నారంట. ఇంత వరకూ ఏ ఇండియన్ సినిమాలో ఆ టెక్నాలజీని వాడలేదు. కేజీఎఫ్ సినిమా ఒక సంచలనం రిలీజ్ అయిన అన్ని భాషల్లో రికార్డుల సునామిని సృష్టించింది.
ఆ చిత్ర దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అంటే మామూలుగా ఉంటుందా.. కేజీఎఫ్ లో ఉన్న డిఫరెంట్ ధీమ్స్ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి లాక్కెలాయి. అలాంటి మాయాజాలమే మరోసారి చేసేందుకు నీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అందుకోసం డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీని సలార్ సినిమాలో వాడుతున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు ఎవరూ ఏ సినిమాలో వాడలేదు. కేవలం హలీవుడ్ లో కొన్ని సినిమాల్లో మాత్రమే వాడారు. బ్యాట్‌మెన్, మ్యాట్రిక్ లాంటి సూపర్‌హిట్ చిత్రాల్లో వాడారు. అంటే సలార్ సినిమాను హలీవుడ్ రేంజ్‌లో తీసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. ఇక ఆ టెక్నాలజీతో ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతిని పొందునున్నారు.