కొరయోగ్రాఫర్ చైతన్య.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరులోని హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు చైతన్య మాట్లాడిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
ఢీ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ చైతన్య.. ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని నెల్లూరు క్లబ్ హోటల్‌లో చోటు చేసుకుంది. వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా.. నెల్లూరులోని కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు ఏప్రిల్ 29 అనగా శనివారం చైతన్యకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం కోసం నెల్లూరు చేరుకున్న చైతన్య బారాషహీద్ దర్గా సమీపంలోని నెల్లూరు క్లబ్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమానకి హాజరై తిరగి హోటల్‌కు వచ్చాడు. ఇక ఆదివారం సాయంత్రం.. హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు చైతన్య. ఇక మృతి చెందడానికి ముందు మన తన మనసులోని ఆవేదనను వెల్లడిస్తూ.. సెల్ఫీ వీడియో తీశాడు. దాన్ని తన స్నేహితులకు సెండ్ చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
చైతన్య ఆఖరి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిలో చైతన్య మాట్లాడుతూ.. ‘‘మమ్మీ, డాడీ, చెల్లి లవ్యూ. ఇన్ని రోజులు మీరు నాకు ఏ కష్టం రానివ్వలేదు. మన సర్కిల్, మన చుట్టూ ఉన్న వారి వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక నా వల్ల కావడం లేదు. చాలా చేద్దాం అనుకున్నాను కానీ.. నా వల్ల కావడం లేదు. నాతో ఉన్న వారందరిని చాలా బాధ పెట్టాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని డబ్బుల కారణంగా పొగొట్టుకున్నాను. అప్పులు చాలా అయ్యాయి. తీర్చుకునే సత్తా ఉంది.. కానీ తీర్చలేకపోతున్నాను.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘ఒక చోట అప్పు తీర్చడానికి మరో చోట అప్పు.. ఒక దాని తర్వాత ఒకటి తప్పు.. ఇక వీటిని తట్టకోవడం నా వల్ల కావడం లేదు. ఢీ షోకి చాలా రుణపడి ఉన్నాను. ఈ షో వల్ల నాకు పేరు, గుర్తింపు వచ్చింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాను. ఇల్లు, టీవీ కొనాలనుకున్నాను.. కానీ నా వల్ల కాలేదు. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను.. ఢీ పేరు ఇస్తే.. జబర్దస్త్.. డబ్బులు ఇస్తుంది. ఇక ఈ ఒత్తిడిని నేను తట్టుకోలకపోతున్నాను. జీవితంలో ఇదే చివరి రోజు. అమానాన్నా థాంక్యూ.. మీరు నాకు చాలా మంచి జీవితం ఇచ్చారు. మీకేం చేయలేకపోతున్నాను.. జాగ్రత్త’’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రసుత్తం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
టీవీలో వచ్చే షో లో ఒక్కసారి కనపడితే చాలు సెలబ్రిటీ అయిపోవచ్చని చాలామంది కలలు కంటుంటారు. అదృష్టం బాగుండి కొందరికి అవకాశం వస్తుంది. అయితే వారు ఆ అవకాశాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు అన్న దాని మీద ఆ రంగంలో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఢీ షోలో కనిపించడం కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తారు. కానీ కొందరికే అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే.. జీవితంలో ఎంత గొప్ప స్థాయికి చేరుకోవచ్చో.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌లను చూస్తే అర్థం అవుతుంది. వారిద్దరూ ఢీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని.. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అయినా సెలబ్రిటీ హోదా లేకపోతే.. బతకలేమా.. నీ మీదనే ప్రాణం పెట్టుకున్న తల్లిదండ్రులను ఇలా మోసం చేయవచ్చా.. అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. మరి చైతన్య తీసుకున్న నిర్ణయం సరైందేనా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.