Dance India Dance: దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జీ నెట్ వర్క్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో జీ తెలుగు ఛానల్ అనేక రియాలిటీ షోలు నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న గాయనీ గాయకులను, అనేక మంది డాన్సర్ లను ఇండస్ట్రీకి అందిస్తోంది. ప్రతి ఏడాది సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో డాన్స్ రియాలిటీ షోతో ముందుకు రానుంది.
ఈసారి డాన్స్ షోలో తెలుగు ప్రేక్షకులను కూడా భాగస్వామ్యం చేసేందుకు జీ తెలుగు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ‘జీ నెట్ వర్క్’కి సంబంధించిన పాపులర్ రియాలిటీ షో ”డాన్స్ ఇండియా డాన్స్” ఇప్పుడు తెలుగులో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ‘డాన్స్ ఇండియా డాన్స్’ కొన్నేళ్లుగా వివిధ భాషలలో నిర్వహించబడి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే అనేక ఔత్సాహిక డాన్సర్లకు బంగారు భవిష్యత్తు అందించింది.
ఇప్పుడు కేవలం తెలుగు జనాలకు అవకాశం కల్పించేందుకు, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిభ గల డాన్సర్లను వెతికి పట్టుకునేందుకు ”డాన్స్ ఇండియా డాన్స్” ఆడిషన్స్ నిర్వహించబోతుంది. ఇక మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో “డాన్స్ ఇండియా డాన్స్” కాస్త భిన్నంగా ఉండబోతుంది. ‘జీ తెలుగు’ రాష్ట్రాల వ్యాప్తంగా డాన్సర్లను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేయనుంది.
జూన్ 23 నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూల్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఆడిషన్స్ జరగనున్నాయి. మరో విషయం ఏంటంటే.. ఈ ఆడిషన్స్ లో వయో పరిమితులు లేవు. డాన్స్ మీద ఆసక్తి ఉన్న 6 – 60 ఏళ్ళ వయస్సు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ ఆడిషన్స్ జూన్ 23న వరంగల్, ఖమ్మంలో.. జూన్ 24న కర్నూల్, విజయవాడలో.. జూన్ 26న తిరుపతి, వైజాగ్ లో జరగనున్నాయి.
ఆడిషన్ జరిగే చోటుకు వెళ్లలేనివారు డిజిటల్ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారు డాన్స్ వీడియో షూట్ చేసి 9154984009 నెంబర్ కి వాట్సాప్ చేయాలి లేదా did.zeetelugu@gmail.com కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుంటే ‘didtelugu.zee5.com కు లాగిన్ అవ్వడం ద్వారా కూడా డ్యాన్స్ వీడియోలను పంపవచ్చు. మరి డాన్స్ ఇండియా డాన్స్ తెలుగులో పాల్గొనాలని అనుకునేవారు, లేదా తెలిసినవారికి ఈ పోస్ట్ షేర్ చేయవచ్చు. మరి డాన్స్ ఇండియా డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.