హీరో నాగచైతన్య సినిమాలతో కాదు.. ఓ విషయంలో వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ దక్ష అక్కినేని హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అక్కినేని హీరోల్లో నాగచైతన్య కాస్త డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాకుండా ప్రతిసారి కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. వ్యక్తిగత జీవితం గురించి ఎవరెన్ని మాటలన్నా సరే.. వాటిని అస్సలు పట్టించుకోడు. ఇక హీరోయిన్లు కూడా నాగచైతన్యతో చాలా కంఫర్ట్ గా ఫీలవుతుంటారు. గతంలో పలు సందర్భాల్లో పలువురు హీరోయిన్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలానే హీరోయిన్ దక్ష కూడా చైతూ గుడ్ బిహేవియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేసింది. అప్పట్లో తనకు ముద్దు పెట్టి మరీ సారీ చెప్పాడంటూ చైతూపై ప్రశంసలు కురిపించింది. ఇంతకీ ఇదంతా ఎప్పుడు జరిగింది? తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే!
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సంక్రాంతికి బంగార్రాజు సినిమా రిలీజైంది. ఆ మూవీ ప్రీ రిలీజ్ లో చైతూ వైపు కొంటెగా చూస్తు హీరోయిన్ దక్ష కెమెరా కంటికి చిక్కింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సినిమాల్లో ముద్దు సీన్స్ అనేది ఇప్పుడు చాలా సాధారణ విషయం. ఫ్రొఫెషనల్ భాగంగా ఆ సీన్ పూర్తి చేసిన తర్వాత దాన్ని లైట్ తీసుకుంటారు. తాజాగా హీరోయిన్ దక్ష కూడా ఈ సినిమాలోని ఒక ముద్దు సీన్ గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఓ సీన్ లో భాగంగా హీరో చైతన్య, తనకు ముద్దుపెట్టి సారీ చెప్పాడని పేర్కొంది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“నాగచైతన్య అమ్మాయిలకు చాలా గౌరవం ఇస్తాడు. ఆయనతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. తోటి నటీనటుల మీద ఆయన చాలా శ్రద్ధ చూపిస్తాడు. నేను ఇది డైరెక్ట్ గా చూశాను. మా ఇద్దరి మధ్య ముద్దు సీన్స్ వచ్చినప్పుడు.. అవి పూర్తవగానే నాకు సారీ చెప్పేవాడు. నాగ చైతన్య జెంటిల్ మెన్ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?” అని హీరోయిన్ దక్ష.. నాగచైతన్యపై తెగ పొగిడేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దక్ష చెప్పిన విషయంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.