'కాంతార' సినిమాకు ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇంకా దక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూవీ హీరో కమ్ డైరెక్టర్ కు అరుదైన గౌరవం లభించింది.
కాంతార.. కన్నడ సంప్రదాయాలు ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కేవలం రూ.15 కోట్లతో మూవీ తీస్తే ఏకంగా రూ400 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఏ భాషలో రిలీజ్ చేసినా సరే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ అభినంధనలు, ప్రశంసలు లెక్కలేనన్ని వచ్చాయి. ఇప్పుడు ఆ ఖాతాలోకి మరో అరుదైన ఘనత చేరింది. ‘కాంతార’ హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక మారుమూల పల్లెల్లో పంజుర్లి, గుళిగ దేవుళ్లని పూజించడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. దీన్నే స్టోరీగా రాసుకుని నటుడు రిషభ్ శెట్టి సినిమా తీశాడు. దానికి తానే డైరెక్టర్ గానూ చేశారు. అలా గతేడాది థియేటర్లలో, ఓటీటీలో, టీవీలో అన్ని చోట్ల అదిరిపోయే స్పందన సొంతం చేసుకుంది. తాజాగా కాంతార రెండో భాగం.. అదేనండి ప్రీక్వెల్ తీస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఈ ఆనందంలో ఉండగానే.. రిషభ్ శెట్టికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిందని దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈఓ అభిషేక్ మిశ్రా వెల్లడించారు.
అయితే ఫిబ్రవరి 20న ముంబయిలో జరగబోయే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్-2023’ ఈవెంట్ లో రిషభ్ శెట్టి.. ఈ పురస్కారాన్ని అందుకోనున్నాడు. దీంతో కన్నడ చిత్రసీమ తెగ సంతోషపడుతోంది. ఇదిలా ఉండగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ప్రతి ఏటా ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రదానం చేస్తుంటారు. కన్నడ నుంచి 2019లో కేజీఎఫ్ ఫేమ్ యష్, 2020లో సుదీప్ కు ఈ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ కన్నడ నుంచి ఘనత సాధించిన మూడో వ్యక్తిగా రిషభ్ నిలిచాడు. మరి ‘కాంతార’ హీరోకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Congratulations 🎉 @shetty_rishab
sir for the @Dpiff_official Most Promising Actor Award #RishabShetty pic.twitter.com/14b704UHG3— MNV Gowda (@MNVGowda) February 15, 2023