కస్టడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి తాజాగా, ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అతి త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ కానుంది. మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ అవ్వనుంది.
టాలీవుడ్ హీరో నాగ చైతన్య.. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కస్టడీ’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించినంత స్థాయిలో స్పందన రాలేదు. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. కస్టడీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నెల 9వ తేదీనుంచి సదరు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి నటించారు.
ఈ ఇద్దరూ ఇంతకు ముందు బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, కస్టడీ బైలింగువల్ సినిమాగా తెరకెక్కింది. అరవింద స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్ల పరంగా ఫేయిల్ అయింది. నాగ చైతన్య-కృతి శెట్టి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కాబట్టి.. బంగార్రాజు మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఫలితాలు అనుకోని విధంగా వచ్చాయి. మరి, కస్టడీ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.