'కస్టడీ'కి థియేటర్లలో యావరేజ్ టాక్ వచ్చింది. రిలీజ్ కి ముందు కాస్త హైప్ ఉండటంతో తొలిరోజు కలెక్షన్స్ అన్ని కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
నాగచైతన్య ‘కస్టడీ’ థియేటర్లలోకి వచ్చేసింది. అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమా గురించి అక్కినేని ఫ్యాన్స్ తెగ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ హీరోలకు గత ఏడాదిగా అస్సలు కలిసిరావడం లేదు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. తమ ప్రతి మూవీతోనూ ఫ్లాఫ్స్ అందుకున్నారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి అన్నట్లు ‘కస్టడీ’ వచ్చింది. రిజల్ట్ గురించి పక్కనబెడితే తొలిరోజు కలెక్షన్స్ ఆశ్చర్యం కలిగించాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య డిఫరెంట్ మూవీస్ చేస్తాడనే పేరుంది. ‘కస్టడీ’ విడుదలకు ముందు కూడా ఈ సినిమా సమ్ థింగ్ డిఫరెంట్ ఉండబోతుందని అనుకున్నారు. ఎందుకంటే డైరెక్టర్ వెంకట్ ప్రభు కాబట్టి. కానీ రియాలిటీలో జరిగింది వేరు. మొదటిరోజు మూవీ చూసిన ఆడియెన్స్ షాకయ్యారు. కథ బాగున్నా సరే సినిమాని మాత్రం చెడగొట్టేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ వీకెండ్ ఏదో అలా నడిచేయొచ్చు గానీ ఆ తర్వాత మాత్రం కష్టమే అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
అయితే రిలీజ్ కి ముందు హీరో నాగచైతన్య కాన్ఫిడెన్స్ చూసి ‘కస్టడీ’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే తొలిరోజు బుకింగ్స్ బాగానే జరిగాయి. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ రూ.4 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కల్ని అధికారికంగా రిలీజ్ చేస్తే గానీ అసలు విషయం బయటకు రాదు. ఇదిలా ఉండగా ఈ మూవీలో చైతూ, కృతిశెట్టి, అరవింద స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉండటం విశేషం. సరే ఇది పక్కనబెడితే ‘కస్టడీ’ మొదటిరోజు వసూళ్లపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
#Custody disappoints with an estimated ₹4 Cr WW Gross on 1st Day. And the Reports are Below-par. pic.twitter.com/lOMZ4heP2q
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 13, 2023