బిగ్ బాస్ రియాలిటీ షో.. ఏ స్థాయిలో టీవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో.. అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఇటీవలే 5వ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 6వ సీజన్.. త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే.. బిగ్ బాస్ 6వ సీజన్ OTT వెర్షన్ లో ప్లాన్ చేస్తున్నట్లు యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అలాగే OTT వెర్షన్ బిగ్ బాస్ షోని 24 గంటలపాటు ప్రసారం చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటికి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది. ఇదివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న వారి పేర్లు కూడా మరోసారి ఓటిటిలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ పై సీపీఐ నారాయణ గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అది బిగ్ బాస్ షో కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ నారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.
తాజాగా మరోసారి సిపిఐ నారాయణ బిగ్ బాస్ హౌస్ పై, హోస్ట్ నాగార్జున పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగార్జున అంటే తనకు కోపం కాదు.. అసహ్యం అని కామెంట్ చేశారు. బిగ్ బాస్ లో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.. ఎవరితో డేటింగ్ చేస్తావ్.. ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్.. అంటూ అడుగుతారు. అదేనా బిగ్ బాస్ అంటే అని మండిపడ్డారు. ప్రస్తుతం నారాయణ మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.