రియాలిటీ షో లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రాం బిగ్ బాస్. త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లో ఓ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు అంతా బిగ్ బాస్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చించుకుంటున్నారు. షో స్టార్ట్ అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ఏడో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్-7ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఎదురుచూపులకు తెరపడింది. నాగ్ ప్రోమో రావడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు ఎవరు కంటెస్టెంట్లుగా వెళ్లనున్నారు? అనే వెతుకులాట మొదలైంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇక విషయానికి వస్తే కంటెస్టెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించనుంది బిగ్ బాస్. ఈ సారి బిగ్ బాస్ – 7లో సందడి చేయబోయేది వీళ్లే అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బిగ్ బాస్ సీజన్ – 7 లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భరత్, ఉదయభాను, ఢీ ఫేం పండు, సురేఖ, అమర్ దీప్, తేజస్విని, మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవి, విష్ణు ప్రియ, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నటుడు, బుల్లితెర మెగాస్టార్‌గా పిలువబడే ప్రభాకర్ కూడా వెళ్తున్నాడని రుమార్లు వస్తున్నాయి. తను రాకుంటే ఒక వేళ తన కొడుకు చంద్రహాస్‌ని రంగంలోకి దించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంగతి పక్కనపెడితే..
తాజాగా ఇదే లిస్ట్ లోకి చేరింది ఓ జంట. ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన ఆట సందీప్, జ్యోతి జంట కూడా ఈ సీజన్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆట ప్రొగ్రామ్ ద్వారా మంచి పేరు, ఫేమ్ సంపాదించుకున్నాడు. సందీప్‌కి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. ఎప్పడికప్పుడు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమా ఈవెంట్లు, కవర్ సాంగ్స్ చేస్తూ తనదైన మార్క్ డాన్స్‌లతో జనాలను అలరిస్తుంటాడు. తాజాగా ఒక సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాడు. చిరంజీవి అభిమాని అయిన సందీప్ జోడి బిగ్ బాస్‌లోకి వస్తే మరింత హైప్ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటున్నరట. మరి అసలు ప్రోమో వచ్చేదాకా వేచి చూడక తప్పదు. త్వరలో రాబోయే ఈ షో పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.